Movie News

అగ్గి రాజేస్తున్న బండ్ల గ‌ణేష్‌


నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొన్ని రోజులుగా వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నాడు. ఓవైపు కథానాయకుడిగా ఒక కొత్త సినిమాను మొదలుపెట్టడం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన బండ్ల.. మరోవైపు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలవడం చర్చనీయాంశంగా మారింది.

మొన్నటిదాకా ప్రకాష్ రాజ్ ప్యానెల్లో అధికారిక ప్రతినిధిగా కొనసాగిన బండ్ల.. ఉన్నట్లుండి యు టర్న్ తీసుకోవడం ‘మా’ ఎన్నికల్లో కీలక మలుపనే చెప్పాలి. గత రెండేళ్లు నరేష్ కార్యవర్గంలో ఉన్న జీవిత.. ఉన్నట్లుండి ఇప్పుడు ప్రకాష్ రాజ్ వర్గంలోకి రావడం, ఈ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి పోటీలో నిలవడం అనూహ్య పరిణామమే. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తాను బయటికి రావడానికి జీవితనే కారణమని ఓపెన్‌గా చెప్పేశాడు బండ్ల. వివిధ సందర్భాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేసిన జీవితకు తానెలా మద్దతు ఇస్తానంటూ బండ్ల ప్రశ్నిస్తున్నాడు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు చిరంజీవి మద్దతు ఉన్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్, నాగబాబు ఇద్దరూ కూడా ఇదే చెప్పుకున్నారు. ఐతే తనను, తన తమ్ముడిని పలు సందర్భాల్లో టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన జీవితకు ఇప్పుడు చిరు ఎలా మద్దతిస్తారనే ప్రశ్న ఆటోమేటిగ్గా తలెత్తుతోంది. బండ్ల ఈ పాయింట్ పట్టుకుని ట్విట్టర్ ద్వారా అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్నాడు.

గత ఎన్నికల సందర్భంగా పవన్ మీద రాజశేఖర్, జీవిత తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియోను బండ్ల ట్విట్టర్లో షేర్ చేశాడు. పవన్ బాహుబలిని మించిన ప్యాకేజీ తీసుకున్నాడంటూ రాజశేఖర్ ఆ వీడియోలో వ్యాఖ్యానించడం గమనార్హం. కొన్ని రోజుల ముందే చిరంజీవిపై జీవిత విమర్శలు చేసిన వీడియోను కూడా బండ్ల షేర్ చేశాడు. ఇవి చూసిన మెగా అభిమానులు, మద్దతుదారులెవరూ తాజా పరిణామాలను జీర్ణించుకోలేకపోవచ్చు. గతం గత: అని జీవిత.. బండ్ల అభ్యంతరాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అతనైతే తగ్గేలా కనిపించడం లేదు. ఇక్కడ చిరు, పవన్‌ల మీద బండ్ల నిజమైన అభిమానం కనిపిస్తోంది. జీవిత విషయంలో చిరు సర్దుకున్నా సరే.. బండ్ల మాత్రం ఆమె ప్రకాష్ రాజ్ ప్యానెల్లోకి రావడాన్ని ఏమాత్రం అంగీకరించేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆమెకు ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేస్తున్నట్లే కనిపిస్తున్నాడు ఈ మెగాభిమాని.

This post was last modified on September 6, 2021 12:54 pm

Share
Show comments

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

1 hour ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

7 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

9 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

10 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

12 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

13 hours ago