Movie News

ఆ కమెడియన్ వర్మను ఫాలో అవుతున్నాడా?

రామ్ గోపాల్ వర్మ సినిమాలను ప్రమోట్ చేయడానికి హీరో హీరోయిన్లు అక్కర్లేదు. ప్రి రిలీజ్ ఈవెంట్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు అవసరం లేదు. ట్విట్టర్లో ఆయనొక్కడే కూర్చుని సినిమాను ప్రమోట్ చేసుకుంటాడు. టార్గెటెడ్ ఆడియన్స్‌కు సినిమాను రీచ్ చేయడానికి ఎన్ని గిమ్మిక్కులు చేయాలో అన్నీ చేస్తాడు.

ఈ మధ్య వర్మ మరీ క్రెడిబిలిటీ కోల్పోవడం, ఆయన సినిమాలు నాసిరకంగా తయారవడంతో జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. వర్మ శైలి ప్రమోషన్లు చాలా సినిమాలకు బాగానే కలిసొచ్చాయి.

చాలా వరకు వివాదాస్పదమైన కామెంట్లు చేయడం.. అతిశయోక్తి మాటలు చెప్పడం.. ప్రేక్షకులను రెచ్చగొట్టేలా ఏదో ఒకటి చేయడం ద్వారా వర్మ వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా సరిగ్గా వర్మనే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

రాహుల్, అవికా గోర్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ ఫిలిం ‘నెట్’ ఈ నెల 10న జీ5లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీన్ని ట్విట్టర్లో రాహుల్ చాలా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు. ఒక బూతు మాట వాడుతూ ఈ సినిమా గురించి అతను పెట్టిన కామెంట్ వివాదాస్పదమైంది.

దీనిపై నెటిజన్లు చాలామంది విరుచుకుపడ్డారు. సినిమాను ప్రమోట్ చేయడానికి బూతులు వాడతావా అంటూ అతణ్ని తప్పుబట్టారు. ఐతే రాహుల్ ఏమీ తగ్గలేదు. ట్విట్టర్లో అందరూ పతిత్తులే అన్నమాట అంటూ కౌంటర్ వేశాడు. ఆ తర్వాత కూడా ఇదే రీతిలో కామెంట్లు పెడుతూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.

దేవుళ్లనే వాళ్లు నిజంగా ఉంటే తమ సినిమాను కచ్చితంగా ప్రమోట్ చేస్తారని.. ఎందుకంటే తమ సినిమా మానవాళికి మంచిది చేసేదని రాహుల్ ఒక పోస్ట్ పెట్టాడు. అలాగే.. ‘‘కేసీఆర్‌ను బండి తిట్టాడు. ఫడ్నవీస్ ఏదో అన్నాడు. రాహుల్ రామకృష్ణ ‘నెట్’ చూడమన్నాడు’’ అంటూ ఇంకో ట్వీట్లో కామెంట్ చేశాడు. తమ సినిమా చూడాలంటే ధైర్యం కావాలంటూ సంక్షిప్త పదాల్లో మరోసారి బూతులు జోడించి ఇంకో కామెంట్ పెట్టాడు. రాహుల్ తీరు చూస్తుంటే.. రిలీజ్ దగ్గర పడేసరికి రాహుల్ ఇంకా దూకుడు పెంచేలాగే ఉన్నాడు.

This post was last modified on September 5, 2021 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!

ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…

4 hours ago

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

10 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

11 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

12 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

13 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

13 hours ago