పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కెరీర్లో ఎన్నడూ లేనంత స్పీడు మీద ఉన్నాడు. రెండేళ్లకు పైగా సినిమాల నుంచి విరామం తీసుకున్నాక.. ఆయన శరవేగంగా రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ను పూర్తి చేశాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’తో పాటు సాగర్ చంద్ర డైరెక్షన్లో ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ రెండూ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.
త్వరలోనే హరీష్ శంకర్ సినిమాను కూడా మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాది కిందటే అనౌన్స్ అయిన ఈ చిత్రాన్ని దసరాకు ప్రారంభిస్తారని అంటున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటించనున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా పూజా .. ఈసారి పవన్ పుట్టిన రోజుకు విష్ చేయడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
ఐతే ఈ చిత్రంలో మరో కథానాయిక కూడా నటించనుందని.. ఆ హీరోయిన్ ప్రియమణి అని వార్తలొస్తున్నాయి. హీరోయిన్‌గా కొన్నేళ్లు మంచి ఊపులో ఉన్న ప్రియమణి.. తర్వాత డౌన్ అయింది. పెళ్లి చేసుకుని వ్యక్గిగత జీవితంలో సెటిలయ్యాక కొంత కాలం సినిమాలకు దూరమైంది. కానీ ఈ మధ్య మళ్లీ సినిమాల్లో మెరుస్తోంది. ‘నారప్ప’తో పాటు ‘విరాటపర్వం’ చిత్రాల్లో ఆమె నటించింది. పవన్-హరీష్ సినిమాలో ఆమె ప్రధాన కథానాయిక అయితే అయ్యుండకపోవచ్చు. ఆమెది స్పెషల్ రోల్ అయ్యే అవకాశముంది. ఏమో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఏదైనా చేస్తున్నా ఆశ్చర్యం లేదు.
ఐతే ఇక కెరీర్ లేదనుకున్న దశ నుంచి పవన్‌తో సినిమా చేసే స్థాయికి చేరుకోవడం అంటే విశేషమే. కథానాయికగా మంచి ఊపులో ఉన్న టైంలో కూడా ఆమె పవన్‌తో కలిసి నటించలేదు. మరి ఈ అవకాశాన్ని ఆమె ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 2:28 pm
నిన్న జరిగిన లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీని ఉద్దేశించి దిల్ రాజు ఒక మాటన్నారు. తనను…
నాలుగేళ్ల క్రితం 2021లో అల్లుడు అదుర్స్ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు. అనవసరంగా బాలీవుడ్ మార్కెట్…
అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తే పనయ్యే రోజులు కావివి. అలా చేయొచ్చనుకోవడమే అసలు కామెడీ. ఇటీవలే కన్నడ,…
హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…
పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?…
తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…