జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ గురించి వ్యక్తిగత విషయాల్ని చెప్పాల్సి వస్తే.. కుటుంబ పరంగా కంప్లీటీ ఫ్యామిలీ పర్సన్ గా చెప్పాలి. అవుట్ అండ్ అవుట్.. తన జనరేషన్ వారికి భిన్నంగా ఆయన కనిపిస్తారు. పార్టీలు.. పబ్ లకు వెళ్లరు. పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమవుతారే తప్పించి పెద్దగా కనిపించరు. సోషలైట్ అనే కంటే కూడా.. తన పరిధిలోనే తాను ఉండటం.. ఎంపిక చేసినట్లు ఉండే కొందరి ఫంక్షన్లకు తప్పించి.. బయటకు రారు. మిగిలిన హీరోల సతీమణులతో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే విషయంలోనూ తారక్ రూటు సపరేటు అని చెప్పాలి.
అదే సమయంలో చాలామంది సెలబ్రిటీలకు భిన్నంగా లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఎప్పుడు తాను..తన సినిమాలే తప్పించి.. పదేళ్ల వైవాహిక జీవితానికి సంబంధించిన ముచ్చట్లను పెద్దగా ప్రస్తావించని తత్త్వం తారక్ లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆయన తన తీరుకు భిన్నంగా తాజాగా తన భార్య లక్ష్మీ ప్రణతి గురించిన కబుర్లు చెప్పుకొచ్చారు. పూర్తిస్థాయి వ్యక్తిగత వివరాల్ని ఆయన షేర్ చేసుకున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
“మా” వారి బిగ్ బాస్ కు చెక్ పెట్టేందుకు వీలుగా “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రోగ్రాంను తీసుకొస్తున్న వైనం తెలిసిందే. దీనికి హోస్టుగా జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రోగ్రాంలో ఒక కంటెస్టెంట్ తో మాట్లాడే క్రమంలో తన పెళ్లి నాటి ముచ్చట్లను పంచుకున్నారు. ‘పెళ్లి చూపులు సమయంలో కనీసం మీరు బాగా మాట్లాడారమ్మా కానీ మా పెళ్లిచూపుల్లో అయితే మా ఆవిడ అసలు మాట్లాడలేదని తన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.
పెళ్లి చూపుల వేళ లక్ష్మీ ప్రణతిని చూసినంతనే తాను ఓకే చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. తను మాత్రం ఎస్ అని చెప్పలేదన్నారు. అలా అని నో కూడా చెప్పలేదన్నారు.
‘నేనంటే ఇష్టమేనా? లేదంటే బలవంతంగా ఈ పెళ్లి ఫిక్స్ చేశారా? అని ప్రణతిని అడిగా. దానికి ఆమె ఔనని కానీ కాదని కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మా పెళ్లికి ఎంగేజ్ మెంట్ కు మధ్య దాదాపు ఎనిమిది నెలలు గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో కూడా నాకు ఆమె ఎస్ అన్న మాట చెప్పలేదు. దీంతో.. ఆడవాళ్లను అర్థం చేసుకోవటం అంటే ఎంత కష్టమో అర్థమైంది’ అని తారక్ చెప్పుకొచ్చారు.
ఆడవాళ్లను అర్థం చేసుకున్నవాడు ప్రపంచంలో దేన్నైనా అర్థం చేసుకుంటాడన్న విషయం తనకు ఆ తర్వాత అర్థమైందన్న ఆయన.. తన పదేళ్ల వైవాహిక సంబంధానికి సంబంధించి తొలి నాళ్లలో జరిగిన విశేషాల్ని ఆసక్తికరంగా వెల్లడించారు. రానున్న రోజుల్లో మరింకేం విశేషాలు చెబుతారో చూడాలి.
This post was last modified on September 3, 2021 11:09 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…