తెలుగు టీవీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ అయిన షోల్లో ‘బిగ్ బాస్’ ఒకటి. ఎన్నో సందేహాల మధ్య నాలుగేళ్ల కిందట మొదలైన ఈ షో తొలి సీజన్లోనే అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. రెండో ఏడాది దాని క్రేజ్ పతాక స్థాయికి చేరింది. తర్వాతి సీజన్లలో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు పార్టిసిపెంట్లు లేకపోయినా.. షో అనుకున్నంత రసవత్తరంగా సాగకపోయినా దాని ఆదరణేమీ తగ్గలేదు. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకుల మనసులూ గెలుచుకుని మరో స్థాయికి వెళ్లిపోయిందా షో.
గత ఏడాది కరోనా దెబ్బ పడ్డా కూడా షో ఆగలేదు. లేటుగా అయినా షో మొదలైంది. మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కొంచెం లేటుగా అయినా షో మొదలు కాబోతోంది. ఈ ఆదివారమే ఐదో సీజన్ శ్రీకారం చుట్టుకోనుంది. ఐతే షో మొదలు కానుండగా ఎప్పుడూ ఉండే హడావుడి మాత్రం ఈసారి కనిపించడం లేదు.
‘బిగ్ బాస్’కు ప్రతి ఏటా హైప్ వచ్చేదే ఈసారి పార్టిసిపెంట్లు ఎవరు అనేదానిపై వచ్చే రూమర్లతోనే. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చే నడుస్తుంటుంది. ఫలానా ఆర్టిస్టు.. ఆ యూట్యూబర్.. ఈ టిక్ టాక్ స్టార్.. అంటూ పార్టిసిపెంట్ల గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు నడుస్తాయి. నెటిజన్లు గెస్ చేయడం ఒకవైపు.. షో నిర్వాహకుల నుంచి లీక్స్ మరో వైపు.. ఇలా కొన్ని వారాల ముందు నుంచి సోషల్ మీడియాలో ఇదొక డిస్కషన్ పాయింట్‌గా ఉంటుంది.
‘బిగ్ బాస్’ పార్టిసిపెంట్లు వీళ్లే అంటూ లిస్టు లిస్టే ఇచ్చేస్తుంటారు. అలాగే షోలో కొత్త టాస్కుల గురించీ డిస్కషన్ కూడా ఉంటుంది. కానీ ఈసారి అలాంటి చర్చ లేదు. ఊహాగానాలు పెద్దగా లేవు. కొన్ని వారాల ముందు సురేఖా వాణి, షణ్ముఖ్ లాంటి వాళ్ల గురించి కొంత ప్రచారం నడిచింది. ఆ తర్వాత ఈ చర్చ ఆగిపోయింది. ఇంకో మూడు రోజుల్లో షో మొదలవుతున్నా అసలు పార్టిసిపెంట్ల గురించి కానీ, షోలో కొత్త అంశాల గురించి హడావుడే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐతే షో మొదలయ్యాక పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు. ఆదరణకు ఢోకా లేకపోవచ్చేమో.
This post was last modified on September 2, 2021 3:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…