తెలుగులో ఈ మధ్య ఒక క్రేజీ రీమేక్ గురించి చర్చ నడుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుం కోషియుం’ చిత్రాన్ని తెలుగులో తీసేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ హక్కులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఇద్దరు కథానాయకుల పాత్రల కోసం రకరకాల పేర్లు వినిపించాయి. పృథ్వీరాజ్ పాత్రకు రానా దగ్గుబాటి, బిజు మీనన్ క్యారెక్టర్‌కు నందమూరి బాలకృష్ణల పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇప్పటిదాకా అయితే నటీనటుల సంగతి ఏమీ తేలినట్లు లేదు.
ఈ రీమేక్‌కు దర్శకుడెవరన్న దానిపైనా స్పష్టత లేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు రచయితల బృందంతో స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసే పని నడుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే తెలుగు రీమేక్ సంగతేమో కానీ.. తమిళంలో మాత్రం ఈ సినిమాలో హీరోలెవరన్నది ఖరారైపోయినట్లు సమాచారం.
‘అయ్యప్పనుం కోషియుం’ తమిళ రీమేక్ హక్కుల్ని అగ్ర కథానాయకుడు సూర్య సొంతం చేసుకున్నాడట. తన 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. ఇందులో సూర్యతో పాటు కార్తి నటించనున్నారట. కార్తి పృథ్వీరాజ్ పాత్రలో నటించనుండగా.. సూర్య బిజు క్యారెక్టర్లో కనిపించనున్నాడట.
వాళ్లిద్దరికీ ఆ పాత్రలు పర్ఫెక్ట్‌గా సూటయ్యే అవకాశముంది. ఒరిజినల్లో బిజు చేసిన పోలీస్ పాత్ర బాగా హైలైట్ అయింది. ఆ పాత్రను సూర్యకు ఇస్తే ఇంకా ఇంప్రొవైజ్ చేసి బాగా పేలేలా చేస్తాడనడంలో సందేహం లేదు.
పృథ్వీరాజ్ పాత్రలో కార్తి కూడా బాగానే ఎలివేట్ కాగలడు. ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పటిదాకా కలిసి నటించింది లేదు. గతంలో కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి కానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. ‘అయ్యప్పనుం కోషియుం’ లాంటి సినిమాతో ఈ బ్రదర్స్ కలిశారంటే అదిరిపోయే ఔట్ పుట్ రావడం ఖాయం.
This post was last modified on May 29, 2020 12:45 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…