ప్రస్తుతం ఇండియాలోనే తమన్ ఉన్నంత బిజీగా మరే సంగీత దర్శకుడూ లేడంటే అతిశయోక్తి కాదు. దాదాపు పది సినిమాలున్నాయి అతడి చేతిలో ప్రస్తుతం. అందులో చాలా వరకు భారీ చిత్రాలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సహా చాలామంది స్టార్ హీరోలతో అతను పని చేస్తున్నాడు.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏదైనా క్రేజీ మూవీకి పని చేసే అవకాశం వస్తే తమన్ వదులుకోడు. ఎలాగోలా టైం కేటాయించి ఆ సినిమా చేస్తుంటాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించనున్న ‘ఏజెంట్’కు కూడా ఇలాగే అతను ఓకే చెప్పాడు.
కానీ ఇప్పుడు ఏమైందో ఏమో ఈ చిత్రం నుంచి తమన్ తప్పుకున్నట్లు సమాచారం. బహుశా ఈ చిత్రానికి సమయం కేటాయించలేకే తమన్ తప్పుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
తమన్ స్థానంలోకి తమిళ యువ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ వచ్చాడు. అతను ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలు చేశాడు. రామ్ చరణ్ మూవీ ‘ధృవ’తో పాటు నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’, సందీప్ కిషన్ చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’లకు అతను సంగీతం సమకూర్చాడు. వాటికి సంగీత పరంగా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు ‘ఏజెంట్’తో మళ్లీ అతను తెలుగులోకి అడుగు పెడుతున్నాడు. అఖిల్ కెరీర్‌కు చాలా కీలకమైన ఈ సినిమాకు సంగీత పరంగా అతను ఎలాంటి ఎలివేషన్ ఇస్తాడన్నది ఆసక్తికరం.
ఈ చిత్రానికి ఓ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ పని చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అఖిల్ స్థాయికి మించి ఏకంగా రూ.50 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో ఓ కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తాడని అంటన్నారు.
This post was last modified on September 1, 2021 5:52 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్‌లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…