మెగాస్టార్ చిరంజీవి లాంటి ఆల్‌రౌండర్ టాలీవుడ్ అని కాదు.. సౌత్ సినిమా అని కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని కాదు. ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదు అంటే అతిశయోక్తి కాదు. నటన.. ఫైట్లు.. డ్యాన్సులు.. ఏవైనా సరే.. ది బెస్ట్‌గా పెర్ఫామ్ చేయగల అరుదైన నటుడు మెగాస్టార్. నటుడిగా ఎలాంటి రసాన్నయినా.. పాత్రనైనా అద్భుతంగా పండించగల నైపుణ్యం చిరు సొంతం. నటన పరంగా చిరు మీద పైచేయి సాధించగలవాళ్లు ఆయన లాగా డ్యాన్సులు, ఫైట్లు మాత్రం చేయలేరు.
కేవలం చిరు డ్యాన్సులు, ఫైట్ల కోసం ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవాళ్లంటే.. మళ్లీ మళ్లీ సినిమాలు చూసేవాళ్లంటే.. అది చిరుకు మాత్రమే సాధ్యమైన ఘనత. అందుకే చిరు ప్రభ కేవలం టాలీవుడ్‌కు పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ప్రపంచ స్థాయికి కూడా ఆయన ప్రతిభ పాకింది. జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో గొప్ప పేరు సంపాదించిన వాళ్లు చిరుకు సన్నిహితులయ్యారు. ఆయనకు అభిమానులుగా మారారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్.. చిరుకు ఎంతో సన్నిహితుడు. చిరు ప్రతి పుట్టిన రోజుకూ ఎంతో ఆప్యాయంగా విష్ చేస్తాడు. వేరే సందర్భాల్లో కూడా చిరు గురించి స్పందిస్తుంటాడు. ఇటీవల కూడా చిరు పుట్టిన రోజుకు సచిన్ విష్ చేయడం తెలిసిందే. ఇప్పుడు మరో కి్రకెట్ దిగ్గజం కపిల్ దేవ్.. హైదరాబాద్‌కు వచ్చి ప్రత్యేకంగా చిరును కలుసుకోవడం విశేషం. హైదరాబాద్‌లో చారిత్రక లగ్జరీ హోటల్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో చిరుతో పాటు ఆయన సతీమణి సురేఖ.. కపిల్ దేవ్‌ను కలిశారు. ఈ ముగ్గురూ కలిసి అక్కడ విందు ఆరగించారు. చిరు దంపతులతో కపిల్ ఎంతో సన్నిహితంగా ఫొటోలు కూడా దిగారు.
ఆ ఫొటోలు చూస్తే కపిల్, చిరుల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అర్థమవుతుంది. ఈ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ కపిల్‌తో తనకున్న అనుబంధాన్ని, స్నేహాన్ని గుర్తు చేసుకున్నాడు చిరు. ఈ ట్వీట్ చూసి ఎంతైనా చిరు రేంజే వేరు అంటూ తెలుగు నెటిజన్లు మెగాస్టార్‌ను కొనియాడుతున్నారు.
This post was last modified on August 30, 2021 12:42 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…