సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా అక్కినేని నాగచైతన్య-సమంతలకు పేరుంది. వీళ్లిద్దరూ ప్రేమలో పడిన దగ్గర్నుంచి.. వార్తల్లో వ్యక్తులే. పెళ్లి తర్వాత తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందీ జంట. సోషల్ మీడియాలో ఈ జంటకుండే ఆదరణే వేరు. బెస్ట్ పెయిర్ అనే మాటకు ఒక ఉదాహరణ లాగా కనిపించే చై-సామ్‌ల మధ్య విభేదాలు తలెత్తాయని.. వీళ్లిద్దరూ విడిపోతున్నారని కొన్ని రోజులుగా వార్తలొస్తుండటం వారి అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.
తన పేరులో ఉన్న ‘అక్కినేని’ పదాన్ని తీసేయడంతో జనాలకు ముందుగా అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత చైతూతో కలిసి ఉన్న ఫొటోలేవీ షేర్ చేయకపోవడం.. తన గురించి స్పందించకపోవడం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెడుతున్న పోస్టుల్లో నర్మగర్భపు వ్యాఖ్యలు చేస్తుండటం అనుమానాలను పెంచుతూ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఆదివారం నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన్ని మామా అని సంబోదిస్తూ విషెస్ చెప్పడంతో చైతో ఆమె బంధంపై తలెత్తుతున్న అనుమానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లే కనిపించింది. కానీ ఇది ఉదయం సంగతి. సాయంత్రానికి మళ్లీ కథ మారిపోయింది. మళ్లీ అనుమానాలు ముసురుకున్నాయి. నాగ్ పుట్టిన రోజు వేడుకల్లో సమంత కనిపించకపోవడమే ఇందుక్కారణం. ఈ వేడుకలకు నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ హాజరయ్యారు. ఇంత ముఖ్యమైన వేడుకకు సమంత హాజరుకాకపోవడం యాదృచ్ఛికం అని అబిమానులు భావించడం లేదు.
ఈ మధ్యే సామ్.. ఓ తమిళ సినిమా చిత్రీకరణ కోసం చెన్నైకి వెళ్లింది. ఐతే ఒక పూట విరామం తీసుకుని చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చి నాగ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనలేనంత ఇబ్బంది అయితే సమంతకు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వేడుకలో సామ్ పాల్గొనకపోవడానికి కారణం వేరే అని.. అది చైతూకు దూరంగా ఉండటమే కావచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ సస్పెన్సుకు చైతూ-సామ్ ఎప్పుడు తెరదించుతారో చూడాలి.
This post was last modified on August 30, 2021 12:21 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…