ఇప్పుడు ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న హీరో అంటే ప్రభాసే. ఇటు సౌత్.. అటు బాలీవుడ్ సూపర్ స్టార్లను మించి చాలా పెద్ద హీరోగా ఎదిగిపోయాడతను. ‘బాహబలి’తో అతడి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎలా విస్తరించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి’ తర్వాతి నుంచి ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో వందల కోట్ల బడ్జెట్లోనే తెరకెక్కతున్నాయి.
వివిధ భాషల దర్శకులు ప్రభాస్ కోసం క్యూ కట్టేస్తున్నారు. తన స్థాయికి తగ్గ భారీ కథలు ఒక్కొక్కటిగా ప్రభాస్ ఓకే చేసి సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఆల్రెడీ ‘రాధేశ్యామ్’ను విడుదలకు సిద్ధం చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ చిత్రాల షూటింగ్‌లో సమాంతరంగా పాల్గొంటున్నాడు. నాగ్ అశ్విన్ సినిమా కూడా మొదలైపోగా.. ఇంకా ప్రభాస్ షూటింగ్‌కు హాజరు కావాల్సి ఉంది.
ఈ మూడు చిత్రాలూ పూర్తి కావడానికి అటు ఇటుగా ఇంకో రెండేళ్ల సమయమైనా పడుతుంది. ఇప్పట్లో ప్రభాస్ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించకపోయినా.. ప్రభాస్ దగ్గరికి కథలు వస్తూనే ఉన్నాయి. అతడి నుంచి కమిట్మెంట్ తీసుకోవడానికి నిర్మాతలు, దర్శకులు తెగ ట్రై చేస్తూనే ఉన్నారు. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా ఓకే చేశాడని.. బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తోనూ ప్రభాస్‌కు ఓ సినిమా ఉందని.. ‘సాహో’ దర్శకుడు సుజీత్‌తోనూ మరో చిత్రం చేస్తాడని వివిధ సందర్భాల్లో వార్తలు రావడం తెలిసిందే.
ఇప్పుడు ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టుల జాబితాలో ఇంకోటి చేరింది. బాలీవుడ్లో మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన రోహిత్ శెట్టి కూడా ప్రభాస్‌తో సినిమా కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడట. అతడి కోసం ఓ కథ సిద్ధం చేశాడట. ప్రభాస్‌కు ఇప్పటికే ఆ కథ వినిపించాడని.. అతను సూచన ప్రాయంగా అంగీకారం తెలిపాడని.. ఓ అగ్ర నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కుతుందని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. ఐతే ఈ సినిమా పట్టాలెక్కాలంటే మాత్రం కనీసం మూడేళ్లయినా సమయం పట్టేలా ఉంది.
This post was last modified on August 29, 2021 6:37 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…