మొత్తానికి చాలా ఏళ్ల విరామం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులు కలిసి నటించబోతున్నారు. ఇంతకుముందు మనం లాంటి మరపురాని సినిమా కోసం జత కట్టిన నాగార్జున, నాగచైతన్య.. ఈసారి బంగార్రాజు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. తండ్రీ కొడుకులు చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా.. పైగా సొంత బేనర్లో తెరకెక్కుతుండటం.. అందులోనూ సోగ్గాడే చిన్నినాయనా లాంటి బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఐతే ఈ చిత్రంలో చైతూ పాత్ర ఏంటి అన్న విషయంలో అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు నాగార్జున. ఇందులో నాగార్జున, నాగచైతన్యల పేర్లను వేసి.. కింద ఇన్ అండ్ యాజ్ బంగార్రాజు అంటూ టైటిల్ వేశారు.
అంటే తండ్రీ కొడుకులిద్దరూ బంగార్రాజు పాత్రనే చేస్తున్నారా.. యుక్త వయసులో బంగార్రాజుగా చైతూ కనిపించి.. వయసు మళ్లాక నాగార్జున ఆ పాత్రలో దర్శనమిస్తాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదే నిజమైతే.. నాగ్-చైతూ సినిమాలో కలిసి కనిపించే అవకాశం లేనట్లే. అలా కాకుండా వీళ్లిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించే అవకాశాలనూ కొట్టి పారేయలేం.
ఒకవేళ యంగ్ బంగార్రాజుగా చైతూ కనిపించేట్లయితే.. నాగ్ లాగా ఆ పాత్రలో చైతూ హుషారుగా, రొమాంటిగ్గా, కొంటెగా నటించి మెప్పించగలడా అన్నది డౌటు. ఏదైమైనా నాలుగైదేళ్లు కష్టపడి తీర్చిదిద్దిన స్క్రిప్టులో ఏదో విశేషం ఉండే ఉంటుందని.. సోగ్గాడే చిన్నినాయనా తరహాలోనే ఇది కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.
This post was last modified on August 26, 2021 10:59 am
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…