మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్ ‘లూసిఫర్’ రీమేక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గా చిరంజీవి పుట్టినరోజు నాడు ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. టైటిల్ చిరుకి సూట్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టిన టీమ్ కి ఇప్పుడు షాక్ తగిలింది.
ఈ సినిమాకి కెమెరామెన్ గా నీరవ్ షాను తీసుకున్నారు. ఈ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ చిరు సినిమాతో పాటు అజిత్ సినిమాకి కూడా పని చేస్తున్నారు. అజిత్ ‘వాలిమై’ షూటింగ్ కోసం నీరవ్ షా వారం రోజుల పాటు రష్యాకు వెళ్లాల్సి వచ్చిందట. ఇంతకముందే ‘వాలిమై’ షూటింగ్ కోసం కమిట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు చిరు సినిమాను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ‘గాడ్ ఫాదర్’ టీమ్ కి ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. మరి ఈ గ్యాప్ లో యూనిట్ ఎలాంటి ప్లాన్లు వేస్తుందో చూడాలి. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో కనిపిస్తుందని టాక్. కానీ దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు!
This post was last modified on August 25, 2021 7:18 pm
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…