కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న బాలీవుడ్‌కు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లే అంతో ఇంతో వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. థియేటర్లలో వసూళ్ల మీద పూర్తిగా ఆశలు పోయాయి బాలీవుడ్‌కు. వెండితెరల్లో ఎప్పటికి వెలుగులు నిండుతాయో.. తమ సినిమాలకు మునుపట్లా ఎప్పటికి వసూళ్లు వస్తాయో వారికి అంతు బట్టడం లేదు. తాజాగా రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ వసూళ్లు చూసి బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది. సాధారణంగా అక్షయ్ సినిమాలకు తొలి రోజు వచ్చే వసూళ్లు కూడా ఈ చిత్రానికి ఫుల్ రన్లో రావట్లేదు.
ఐతే ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్న కొన్ని హిందీ చిత్రాలకు మాత్రం మంచి స్పందనే వస్తోంది. ఈ మధ్య ‘మిమి’ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై చాలా మంచి స్పందన రాబట్టుకుంది. దాని తర్వాత వచ్చిన ‘షేర్షా’కు సైతం రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ సినిమా చూసిన వాళ్లందరూ చాలా పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు.
రెగ్యులర్‌గా సినిమాలు చూసే వాళ్లే కాక వివిధ రంగాల వాళ్లు ‘షేర్షా’ చూసి ఎగ్జైట్ అవుతున్నారు. సైనికాధికారులు కూడా ఈ సినిమా చాలా బాగా తీశారని ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మరో పెద్ద వ్యక్తి నుంచి ‘షేర్షా’కు ప్రశంసలు లభించాయి. ఆ వ్యక్తి సినిమా వాడే. తమిళ లెజెండరీ యాక్టర్, ఫిలిం మేకర్ కమల్ హాసన్ ‘షేర్షా’ను తెగ పొగిడేశారు. ఒక సినిమా అభిమానిగా.. ఒక దేశభక్తుడి కొడుకుగా సాధారణంగా సినిమాల్లో సైనికులను చూపించే తీరు తనకు అస్సలు నచ్చదని.. కానీ ‘షేర్షా’ మాత్రం అందుకు మినహాయింపు అంటూ కమల్ పొగిడేశారు. ఈ సినిమా చూసి తన ఛాతీ విచ్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సినిమా తీయడానికి దర్శకుడు విష్ణువర్ధన్‌కు మద్దతుగా నిలిచిన ధర్మ మూవీస్ సంస్థకు కమల్ అభినందనలు తెలిపారు. చిత్ర హీరో హీరోయిన్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలను కూడా ఆయన ప్రశంసించారు. తమిళుడైన విష్ణు ఈ సినిమా తీయడం వల్లే కమల్ ఇంతగా ఎగ్జైట్ అవుతున్నాడనిపిస్తోంది. అయినా సరే.. అంతటి లెజెండ్ ఈ సినిమాను ఇంతగా పొగడ్డం చిత్ర బృందానికి ఎంతో ఆనందాన్నిచ్చే విషయమే.
This post was last modified on August 24, 2021 6:18 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…