Movie News

బన్నీకి నో బ్రేక్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత వెంటనే ‘ఐకాన్’ సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు బన్నీ. వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

కొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ రాబోతుంది. అందుకే ‘పుష్ప’ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేస్తున్నారు బన్నీ. సెప్టెంబర్ చివరి నాటికి మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి అక్టోబర్ మొదటి వారంలోనే ‘ఐకాన్’ సెట్స్ పైకి వెళ్లబోతున్నారు మన స్టైలిష్ స్టార్. మధ్యలో బ్రేక్ తీసుకోవాలని కూడా బన్నీ అనుకోవడం లేదు. ‘ఐకాన్’ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలనేది ప్లాన్. దానికి తగ్గట్లుగానే షెడ్యూల్స్ వేసుకుంటున్నారు.

‘ఐకాన్’ను కూడా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో బన్నీ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇందులో బన్నీకి జోడీగా పూజాహెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

This post was last modified on August 24, 2021 6:04 pm

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

37 minutes ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

54 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

1 hour ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

2 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago