కన్నడ హీరో యష్ కు ‘కేజీఎఫ్’ సినిమా భారీ క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. చాలా మంది దర్శకులు యష్ తో కలిసి సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా యష్ కోసం ఓ కథ అనుకుంటున్నారు. ‘అఖండ’ సినిమా తరువాత బోయపాటి-యష్ ల మధ్య సిట్టింగులు జరగబోతున్నాయని సమాచారం. అయితే యష్ కోసం బోయపాటి కొత్తగా కథేం రాయడం లేదు.
ఇప్పటికే తన దగ్గరున్న కథను యష్ కి తగ్గట్లుగా మార్చబోతున్నారట. బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లో గతంలో ‘వినయ విధేయ రామ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది డిజాస్టర్ అయింది. నిజానికి ఈ కథ కంటే ముందు చరణ్ కి మరో కథ చెప్పారట బోయపాటి. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ మరింత ఎక్కువగా ఉండడంతో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ కథను ఎంపిక చేసుకున్నారు. కానీ చరణ్ అంచనా తప్పింది. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ బోయపాటి చెప్పిన మరో కథతో చరణ్ సినిమా చేద్దామనుకున్నారు.
అదే విషయాన్ని బోయపాటికి కూడా పలు సార్లు చెప్పారట. కానీ ప్రస్తుతం చరణ్ ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా.. ఇప్పట్లో బోయపాటితో సినిమా చేసే ఛాన్స్ కనిపించడం లేదు. అందుకే బోయపాటి తన దగ్గర ఉన్న కథను యష్ కి అనుగుణంగా మార్చుతున్నారని సమాచారం. యష్ కి కూడా తెలుగులో నేరుగా సినిమా చేయాలనుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అనుకున్నారు కానీ సెట్ కాలేదు. ఇప్పుడు బోయపాటితో సినిమా వర్కవుట్ అవుతుందేమో చూడాలి!
This post was last modified on August 24, 2021 3:42 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…