కరోనా మహమ్మారి వచ్చాక బాలీవుడ్ వాళ్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదిన్నరకు పైగా థియేటర్ల నుంచి పూర్తిగా ఆదాయం ఆగిపోయింది హిందీ చిత్రాలకు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌కు మధ్యలో దొరికిన విరామాన్ని బాలీవుడ్ ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. హిందీ సినిమాల మార్కెట్ ఉన్న రాష్ట్రాల్లో థియేటర్లు చాలా వరకు మూతపడే ఉన్నాయి. తెరుచుకున్న చోట్ల కూడా సినిమాలకు కనీస స్థాయిలో ఆదరణ లేదు. సెకండ్ వేవ్ తర్వాత అయినా కాస్త పుంజుకుంటామని ఆశిస్తే.. బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాలు తప్పట్లేదు.
థియేటర్లు పూర్తిగా తెరుచుకోకున్నప్పటికీ నెమ్మదిగా పరిస్థితులు బాగుపడతాయన్న ఆశతో ఓ స్టార్ హీరో సినిమాను నాలుగు రోజుల కిందట థియేటర్లలోకి వదిలారు. అదే.. బెల్‌బాటమ్. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన సినిమా ఇది. సినిమాకు మంచి బజ్ కూడా కనిపించింది. ఈ సినిమాతో బాలీవుడ్ రివైవల్ మొదలవుతుందని ఆశించారు.
కానీ హిందీ చిత్ర పరిశ్రమను మరింత కంగారెత్తించే ఫలితాన్ని అందుకుంటోంది బెల్ బాటమ్. అక్షయ్ కుమార్ సినిమాకు ఓపెనింగ్ డే ఇండియాలో రూ.20 కోట్లు వచ్చేవి ఒకప్పుడు. అందులో నాలుగో వంతు కూడా వసూలు కాలేదు రిలీజ్ రోజైన గురువారం. మూడు కోట్ల లోపు నెట్ వసూళ్లకు పరిమితం అయిన ఈ చిత్రం తర్వాతి రోజుల్లో అయినా పుంజుకుంటుందేమో అనుకుంటే అలా ఏమీ జరగలేదు. శనివారం నాటికి మొత్తం ఇండియా వసూళ్లు కేవలం రూ.8.5 కోట్లు మాత్రమే. ఆదివారం కూడా మహా అయితే వసూళ్లు రూ.3 కోట్లుంటాయేమో. ఫుల్ రన్లో రూ.15 కోట్లకు మించి ఈ చిత్రం వసూలు చేసేలా కనిపించడం లేదు.
ఒక్క రోజులో వచ్చే వసూళ్లు ఫుల్ రన్లో కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. బెల్ బాటమ్‌కు ఆశాజనక ఫలితం వస్తే మరిన్ని కొత్త చిత్రాలను రిలీజ్ చేద్దామని ఆశించిన బాలీవుడ్ ఫిలిం మేకర్లకు ఇది శరాఘాతం లాంటి ఫలితమే. చూస్తుంటే ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలేవీ రిలీజయ్యేలా లేవు. మరిన్ని చిత్రాలు ఓటీటీ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on August 23, 2021 10:46 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…