ఈ ఏడాది ‘నాంది’ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేశాడు యువ దర్శకుడు విజయ్ కనకమేడల. హరీష్ శంకర్ సహా కొందరు పేరున్న దర్శకుల దగ్గర పని చేసిన విజయ్.. తన గురువు హరీష్ లాగా దర్శకత్వ అరంగేట్రానికి ఎంటర్టైనర్‌ను ఎంచుకోకుండా.. ‘నాంది’ లాంటి సీరియస్ సినిమా చేసి ఆశ్చర్యపరిచాడు.
ఎన్నో ఏళ్లుగా హిట్టు రుచే తెలియని అల్లరి నరేష్‌కు అత్యావశ్యకమైన విజయాన్ని అందించడమే కాదు.. తన కెరీర్‌కూ మంచి పునాది వేసుకున్నాడు. ఐతే రెండో సినిమా విషయంలో విజయ్ హడావుడి పడిపోలేదు. ఆచితూచి తర్వాతి సినిమాను ఎంచుకున్నాడు.
తాజా సమాచారం ప్రకారం అతను అక్కినేని నాగచైతన్యతో తన రెండో సినిమా చేయబోతున్నాడట. ఈసారి అతను ఓ థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ లాంటి చిత్రాలతో ఊపుమీదున్న షైన్ స్క్ర్రీన్ సంస్థలో ఈ సినిమా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి.. ‘టక్ జగదీష్’ ఓటీటీ విడుదలకు సంబంధించిన హడావుడిలో ఉన్నారు. ఆ చిత్రం రిలీజయ్యాక చైతూ-విజయ్ సినిమాను ప్రకటించే అవకాశముంది.
చైతూ నటించిన ‘లవ్ స్టోరి’ సెప్టెంబరు 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ నటిస్తున్న ‘థ్యాంక్ యు’ చివరి దశలో ఉంది. బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తి చేసిన చైతూ.. ఇటీవలే ‘బంగార్రాజు’ను మొదలుపెట్టాడు. అందులో తండ్రి నాగార్జునతో కలిసి చైతూ నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక విజయ్ కనకమేడల సినిమాలో ఈ అక్కినేని హీరో నటించే అవకాశముంది.
This post was last modified on August 22, 2021 3:28 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…