Movie News

తెలుగు సినిమా మార్కెట్‌కు అక్క‌డ‌ పెద్ద‌ చిల్లే


గ‌త ఆరేడేళ్ల‌లో తెలుగు సినిమాల‌కు బంగారు బాతులా మారింది యుఎస్ మార్కెట్. అక్క‌డ ఇండియాలో మిగ‌తా అన్ని భాషా చిత్రాల కంటే తెలుగు సినిమాల‌కు ఎక్కువ వ‌సూళ్లు వ‌స్తుంటాయి. బాహుబ‌లి రెండు భాగాల‌కు క‌లిపి రూ.200 కోట్ల దాకా వ‌సూళ్లు వ‌చ్చాయంటే మ‌న సినిమాల‌కు అక్కడున్న మార్కెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. అన్నీ బాహుబ‌లి స్థాయికి వెళ్ల‌క‌పోయినా.. మ‌న బ‌డా స్టార్ల సినిమాల‌కు రూ.25-30 కోట్ల మేర హ‌క్కులు ప‌లికే రేంజికి మార్కెట్ ఎగ‌బాకింది. ఐతే క‌రోనా దెబ్బ‌కు ఈ మార్కెట్ అంతా గ‌ల్లంత‌యిపోయింది.

వైర‌స్ దెబ్బ‌కు ఇక్క‌డ లాగే అక్క‌డా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. మ‌ళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. నెమ్మ‌దిగి థియేట‌ర్లు పునఃప్రారంభం అయినా స‌రే.. ముందులా సంద‌డి కనిపించ‌ట్లేదు. ఎన్నారై ప్రేక్ష‌కులు మునుప‌ట్లా థియేట‌ర్ల‌కు పెద్ద ఎత్తున రావ‌ట్లేదు. బాగా ఓటీటీల‌కు అల‌వాటు ప‌డిపోవ‌డం కూడా అందుకు ఓ కార‌ణం కావ‌చ్చు. యుఎస్‌లో టికెట్ల రేట్లు బాగా ఎక్కువ‌. ఒక సినిమా చూసే రేటుతో ఒక ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌నే వ‌చ్చేస్తోంది. పైగా కొత్త సినిమాలు చాలానే ఓటీటీలో రిలీజ‌వుతున్నాయి. వీటికి అల‌వాటు ప‌డి కొత్త సినిమాల కోసం థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెట్టే రోజులు పోయాయి.

అందులోనూ స్టార్ల సినిమాలు పెద్ద‌గా రిలీజ్ కాక‌పోవ‌డం మైన‌స్ అయింది. దీంతో తెలుగు ఎన్నారైల సినిమా క‌ల్చ‌రే మారిపోయి తెలుగు చిత్రాల యుఎస్ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఒక‌ప్ప‌ట్లా భారీ చిత్రాలు వ‌చ్చాక ప‌రిస్థితులు నెమ్మ‌దిగా మెరుగు ప‌డొచ్చేమో కానీ.. ఇప్పుడు మాత్రం ఏమాత్రం ఆశాజ‌న‌కంగా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు కొత్త‌ ప్రిమియ‌ర్స్ ప‌డ‌ట‌మే గ‌గ‌నంగా ఉండ‌గా.. ఒక‌వేళ అవి ప్లాన్ చేసినా ఓపెనింగ్స్ నామ‌మాత్రంగా ఉంటున్నాయి. రాజ రాజ చోర చిత్రానికి మంచి టాక్ వ‌చ్చినా వీకెండ్లో ల‌క్ష డాల‌ర్లు కూడా వ‌సూల‌య్యే ప‌రిస్థితి లేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

This post was last modified on August 22, 2021 6:11 am

Share
Show comments

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

11 minutes ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

1 hour ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

3 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

5 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

6 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

6 hours ago