బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. గత పదేళ్లలో చేసిన సినిమాల జాబితా తీస్తే ‘భజరంగి భాయిజాన్’, ‘సుల్తాన్’ మినహాయిస్తే అన్నీ చాలా సాధారణంగానే కనిపిస్తాయి. అందులోనూ ‘రాధె’ లాంటి కొన్ని చిత్రాలైతే మరీ నాసిరకం. చాలా సల్మాన్ సినిమాలకు కలెక్షన్లు వచ్చి ఉండొచ్చు. ఓపెనింగ్స్ మోత మోగిపోయి ఉండొచ్చు. కానీ ఆయా సినిమాలను చూసి ప్రేక్షకుల్లో చాలా వరకు పెదవి విరిచిన వాళ్లే. ‘రాధె’ సినిమా చూసైతే అభిమానులే మండిపడ్డారు. సల్మాన్ మారాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు.
ఐతే అలాంటి టైంలోనే తమిళంలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘మాస్టర్’ మూవీని సల్మాన్ రీమేక్ చేస్తున్నాడని ప్రకటన రాగానే ఉస్సూరుమన్నారు. అమేజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులు కూడా బాగానే చూసి ఉంటారు. అందులో ఏముందని సల్మాన్ రీమేక్ చేస్తున్నాడనే సందేహాలు తలెత్తాయి వారికి. స్వయంగా సల్మానే ‘మాస్టర్’ రీమేక్ హక్కులు కొన్నట్లు వార్తలొచ్చాయి.
ఐతే ఇప్పుడు ఏమైందో ఏమో సల్మాన్ మనసు మార్చుకున్నాడట. ‘మాస్టర్’ రీమేక్‌లో నటించొద్దని నిర్ణయం తీసుకున్నాడట. ఈ ప్రాజెక్టును సల్మాన్ క్యాన్సిల్ చేసేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఐతే ఈ కబురు విని సల్మాన్ అభిమానులు సహా అందరూ సంతోషిస్తున్నారు. అతడికి జ్ఞానోదయం అయిందని.. ఇలాంటి రొటీన్ చిత్రాలకు దూరంగా ఉంటే మంచిదని అంటున్నారు. దీని బదులే సల్మాన్ అటవీ నేపథ్యంలో ఓ అడ్వెంచరస్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాని బడ్జెట్ రూ.300 కోట్లని అంటున్నారు.
ఐతే ‘మాస్టర్’ రీమేక్ హక్కులను స్వయంగా సల్మానే కొన్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో వాటినే వేరే వాళ్లకు ఇచ్చేస్తున్నాడా లేక ఈ అగ్రిమెంట్‌నే క్యాన్సిల్ చేస్తున్నాడా అన్నది తెలియదు. సల్మాన్ చేయలేదంటే బహుశా హిందీలో ఈ చిత్రం పునర్నిర్మితం అయ్యే అవకాశాలు లేనట్లే. ఐతే తమిళం, తెలుగు భాషల్లో డివైడ్ టాక్‌ను తట్టుకునే ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం.
This post was last modified on August 18, 2021 2:23 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…