Movie News

దిల్ రాజు రీమేక్ మోజు

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఈ మధ్య రీమేక్ మోజు పట్టుకున్నట్లు ఉంది. ఈ మధ్యే ఆయన తమిళ క్లాసిక్‌ ‘96’ను పట్టుబట్టి రీమేక్ చేయించారు. ‘జాను’ పేరుతో తెరకెక్కిన ఆ చిత్రం తెలుగులో దారుణమైన ఫలితాన్నందుకుంది. అయినా రాజు వెనక్కి తగ్గట్లేదు.

తెలుగులో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ‘జెర్సీ’ రీమేక్ హక్కులు కొని.. హిందీలో కరణ్ జోహార్‌తో కలిసి అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి హిందీలోనూ గౌతమ్ తిన్ననూరినే రూపొందిస్తున్నాడు. మంచి ఎమోషన్ ఉన్న కథ, దేశవ్యాప్తంగా అందరికీ కనెక్టయ్యే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో షాహిద్ నటించిన ‘కబీర్ సింగ్’ (అర్జున్ రెడ్డి రీమేక్) తరహాలోనే ఇది కూడా హిందీలో మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

మరోవైపు రాజు తన బేనర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఎఫ్-2’ను కూడా హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా ఆయన మరో తెలుగు సినిమాను హిందీలోకి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు.. హిట్. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా కొత్త దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. అన్ సీజన్లో రావడం వల్ల వసూళ్లు మరీ ఎక్కువ రాలేదు కానీ.. సినిమా మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందింది. అమేజాన్ ప్రైంలో ఈ సినిమాను జనాలు బాగా చూశారు.

హిందీ అర్బన్ ఆడియన్స్‌కు బాగా కనెక్టయ్యే అవకాశమున్న ఈ థ్రిల్లర్ మూవీని హిందీలో మరింత పకడ్బందీగా తీస్తే మంచి ఫలితాన్నందుకునే అవకాశముంది. నాని నుంచి హక్కులు తీసుకున్న రాజు.. బాలీవుడ్లో కొత్తగా ఏర్పడిన పరిచయాల్ని అనుసరించి చర్చలు జరుపుతున్నాడని.. త్వరలోనే ఈ రీమేక్ గురించి కూడా ప్రకటన రావచ్చని అంటున్నారు.

This post was last modified on May 27, 2020 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

1 hour ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

2 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

2 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago