తెలుగు యాంకర్లలో శ్రీముఖిది ఒక సెపరేట్ స్టయిల్. యాంకరింగ్‌లోకి అడుగు పెట్టకముందే కొన్ని సినిమాల్లో నటించిన ఆమె.. చాలా సైలెంట్ అన్నట్లు కనిపించేది. కానీ పటాస్ ప్రోగ్రాం ద్వారా తనలోని మరో కోణాన్ని బయటపెట్టి వీక్షకుల దృష్టిని ఆకర్షించిందామె. తన షోల్లో అరుపులు, కేకలు, కేరింతలతో ఆమె చేసే అల్లరి అలా ఇలా ఉండదు. ఆ అల్లరే శ్రీముఖికి భారీగా అభిమానులను తెచ్చిపెట్టింది.
యాంకరింగ్‌తోనే కాక బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్‌గానూ ఆకట్టుకున్న శ్రీముఖి.. ఈ మధ్యే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా పూర్తిగా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఈ గురువారం క్రేజీ అంకుల్స్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శ్రీముఖి మీడియా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పెళ్లి గురించి అడిగితే.. దానిపై ఆసక్తి లేదు, ఇప్పుడే కాదు అంటూ సమాధానాలు ఇస్తుంటారు ఫిలిం సెలబ్రెటీలు. కానీ శ్రీముఖి మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడింది. పెళ్లి చేసుకోవడం కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె అంది. కానీ తనకు తగిన వాడు దొరకాలని.. అందుకోసమే తన నిరీక్షణ అని అంది శ్రీముఖి.
చాలామంది అమ్మాయిలు తమ వయసు చెప్పడానికి ఇబ్బంది పడతారు కానీ.. శ్రీముఖి మాత్రం ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లని చెప్పేసింది. ఐతే తనకు 31 ఏళ్లు వచ్చే లోపు పెళ్లి చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్లు శ్రీముఖి వెల్లడించింది. ఇక క్రేజీ అంకుల్స్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రం పూర్తిగా నవ్వులతో సాగుతుందని.. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుందని.. ఈ సినిమాతో మంచి విజయాన్నందుకుంటామని ధీమా వ్యక్తం చేసింది శ్రీముఖి.
This post was last modified on August 17, 2021 9:10 am
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…