Movie News

లుంగీ క‌ట్టుకొచ్చి రికార్డులు లేపేశాడు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాలోయింగ్ ఎలాంటిదో.. స‌రైన కంటెంట్‌తో వ‌స్తే సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ ప్ర‌కంప‌న‌లు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువ‌వుతోంది. ఆదివారం స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌వ‌న్ కొత్త సినిమా భీమ్లానాయ‌క్ టైటిల్ రివీల్ చేయ‌డంతో పాటు ఫ‌స్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. నిమిషం నిడివి కూడా లేని ఈ గ్లింప్స్.. సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. వీర లెవెల్లో ప‌బ్లిసిటీ చేసి, ఎంతో హైప్ చేసి రిలీజ్ చేసిన భారీ చిత్రాల‌ టీజ‌ర్ల రికార్డుల‌ను భీమ్లా నాయ‌క్ అల‌వోక‌గా బ‌ద్ద‌లు కొట్టేసింది.

దీనికి వ‌స్తున్న వ్యూస్, లైక్స్ చూసి ఇండ‌స్ట్రీ జ‌నాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం మాస్.. ఇదేం ఊచ‌కోత అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇప్ప‌టిదాకా వ‌చ్చిన తెలుగు సినిమాల టీజ‌ర్ల‌లో ఫాస్టెస్ట్ రికార్డుల‌న్నింటినీ బ‌ద్ద‌లు కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది భీమ్లానాయ‌క్ ఫ‌స్ట్ గ్లింప్స్.

కేవ‌లం 12 గంట‌ల్లోనే 7 మిలియ‌న్ వ్యూస్ మార్కును దాటేశాయి ఈ టీజ‌ర్‌కు. లైక్స్ ఏడు ల‌క్ష‌ల‌కు చేరువ‌గా ఉన్నాయి. కేవ‌లం 52 సెక‌న్ల వీడియోతో ప‌వ‌న్ యూట్యూబ్‌లో చేస్తున్న భీభ‌త్సం మామూలుగా లేదు. జ‌స్ట్ లుంగీ క‌ట్టుకొచ్చి రికార్డుల అంతు చూస్తున్నాడంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలివేష‌న్లు ఇస్తున్నారు ట్విట్ట‌ర్లో. నిజానికి అభిమానులకు ఈ టీజ‌ర్ మీద మ‌రీ అంచ‌నాలేమీ లేవు.

ఐతే మ‌ళ్లీ మ‌ళ్లీ చూసేలా ఉన్న ప‌వ‌న్ స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, లాస్ట్‌లో వ‌చ్చే క్యాప్ష‌న్ పంచ్ డైలాగ్ వారిని ఉర్రూత‌లూగిస్తున్నాయి. మ‌ల‌యాళ మాతృక‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌నే కొంచెం మార్చి మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా త‌మ‌న్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అభిమానుల‌కు విప‌రీతంగా న‌చ్చేసింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ అనే కాదు.. సామాన్య ప్రేక్ష‌కుల‌కు కూడా టీజ‌ర్ బాగానే న‌చ్చుతున్న‌ట్లుంది. సంక్రాంతికి థియేట‌ర్ల‌లో పూన‌కాలు ఖాయం అనిపించేసింది ఈ టీజ‌ర్‌.

This post was last modified on August 16, 2021 7:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!

ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…

1 hour ago

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

8 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

8 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

10 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

10 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

10 hours ago