బాలీవుడ్ స్టార్లు సౌత్ ఇండియాలో షూటింగ్ చేయాలనుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మహా నగరాలనే ఎంచుకుంటారు. ముఖ్యంగా మన భాగ్యనగరంలో బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ సర్వ సాధారణమే. ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీలో వందల సంఖ్యలో బాలీవుడ్ చిత్రాల చిత్రీకరణ సాగింది.
కానీ తెలుగు రాష్ట్రాల్లోని చిన్న టౌన్లకు వెళ్లి హిందీ సినిమాల షూటింగ్ చేయడం చాలా అరుదు. అందులోనూ ఆమిర్ ఖాన్ లాంటి బడా బాలీవుడ్ స్టార్ తన చిత్రం షూటింగ్ కోసం ఆంధ్రా ప్రాంతంలోని అమలాపురం అనే టౌన్‌కు రావడం ఊహించలేం. ఐతే ఇప్పుడు అదే జరుగుతోంది.
తన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమలాపురానికి విచ్చేసినట్లు సమాచారం. అమలాపురంతో పాటు కాకినాడ పోర్టులోనూ ఈ సినిమాకు సంబంధించి ఒకట్రెండు రోజుల చిత్రీకరణ చేస్తున్నారట.
‘లాల్ సింగ్ చద్దా’లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆధారమైన హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’లో ఓ అరగంట కనిపించే కీలకమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర సినిమాలో అర్ధంతరంగా ముగిసిపోతుంది. ఐతే ఆ పాత్ర కలను హీరో నెరవేరుస్తాడు. అందుకోసం ఆ వ్యక్తి ఇంటిని వెతుక్కుంటూ తన ప్రాంతానికి వస్తాడు.
బహుశా ‘లాల్ సింగ్ చద్దా’లో చైతూను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూపించి ఉండొచ్చు. సంబంధిత సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఆమిర్ అండ్ కో అమలాపురానికి వచ్చి ఉండొచ్చు. దీంతో పాటు పోర్టులో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తుంటే ‘లాల్ సింగ్ చద్దా’తో తెలుగు ప్రేక్షకులు బాగానే కనెక్టయ్యే అవకాశముంది. ఆమిర్ మాజీ మేనేజర్ అయిన అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నారు.
This post was last modified on August 13, 2021 2:40 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…