ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సౌత్ లో ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఆంథాలజీ కథలను నిర్మిస్తోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్స్ అంతా కలిసి నటించిన ‘నవరస’ ఆంథాలజీ డ్రామాను నెట్ ఫ్లిక్స్ లోనే విడుదల చేశారు. ఇందులో మూడు కథలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ మరిన్ని ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది. ఈ క్రమంలో రానా దగ్గుబాటి-వెంకటేష్ లతో కలిసి ఓ వెబ్ సిరీస్ నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది.
ఇటీవల నెట్ ఫ్లిక్స్ సంస్థతో మంతనాలు జరిపిన రానా తన బాబాయ్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మధ్యకాలంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతున్నారట. అయితే దీన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఇటీవల వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదల చేశారు. ఆయన నటించిన ‘దృశ్యం 2’ సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారు. రానా ‘విరాటపర్వం’ సినిమా కూడా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. కానీ ఈ విషయంలో ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థతో కలిసి రానా వెబ్ సిరీస్ నిర్మించాలనుకోవడం విశేషం. అందులో వెంకటేష్ కూడా నటిస్తుండడంతో బజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
This post was last modified on August 10, 2021 3:58 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…