సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి బ్లాస్టర్ పేరుతో రిలీజైన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉండటంతో అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. తమకేం కావాలో అదే ఇచ్చారంటూ ‘సర్కారు వారి పాట’ టీంను ఆకాశానికెత్తేస్తున్నారు. అన్నింటికీ మించి వారిని ఆకట్టుకుంటున్నది.. మహేష్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. స్క్రీన్ ప్రెజెన్స్‌లో వచ్చిన మార్పు. కెరీర్లో ఎక్కువగా మూడీగా ఉండే సీరియస్ క్యారెక్టర్లే చేశాడు మహేష్.
ఈ టైపు పాత్రలు చూసి చూసి ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది. ఖలేజా, పోకిరి, దూకుడు సినిమాల్లో మాదిరి మహేష్ మంచి జోష్‌తో కనిపించాలని.. పాత్రల్లో మాస్ టచ్ ఉండాలని.. అల్లరల్లరి చేయాలని.. హుషారుగా నటించాలని అభిమానులు కోరుకుంటారు. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే మహేష్ దగ్గరికి ఇలాంటి పాత్రలు వస్తుంటాయి.
‘దూకుడు’ తర్వాత ‘ఆగడు’లో కొంచెం అల్లరి చేసినా.. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మహేష్ మళ్లీ మూడీ క్యారెక్టర్లే చేస్తూ వచ్చాడు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను.. ఈ చిత్రాలే అందుకు నిదర్శనం. వీటిలో ఏది హిట్టు, ఏది ఫ్లాప్ అన్నది పక్కన పెడితే.. మహేష్ మాత్రం దాదాపుగా సేమ్ లుక్స్‌తో, మూడీగా కనిపిస్తాడు. ఈ టైపు జెంటిల్మన్ పాత్రల్ని పక్కన పెట్టి మహేష్ జోష్ చూపించరాలని, యూత్‌ఫుల్‌గా కనిపించాలన్నది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. ‘సరిలేరు నీకెవ్వరు’లో కొంత మేర అలా ట్రై చేసినా అభిమానులు ఇంకా ఏదో ఆశిస్తున్నారు.
‘సర్కారు వారి పాట’ ఆ లోటును భర్తీ చేసేలాగే కనిపించింది. టీజర్లో విలన్లకు వార్నింగ్ ఇచ్చే సీన్.. ఆ తర్వాత హీరోయిన్ని చూసి ఇచ్చే ఎక్స్‌ప్రెషన్.. చివర్లో మల్లెపూల గురించి పేల్చిన డైలాగ్ అభిమానులకు కనువిందుగా అనిపించాయి. మహేష్ పాత రోజుల్లోకి తీసుకెళ్లిపోయాడని.. మళ్లీ ఆయన పాత్రలో యూత్‌ఫుల్‌నెస్, జోష్ కనిపిస్తోందని, సినిమా బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని వాళ్లు ఆనందోత్సాహాల్లో కనిపిస్తున్నారు.
This post was last modified on August 9, 2021 1:52 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…