‘పుష్ప’ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ఏడాది ముందు నుంచే ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించే నటుడెవరనే దానిపై విపరీతమైన చర్చ జరిగింది. సుకుమార్ చిత్రాల్లో మామూలుగానే విలన్ పాత్రలు చాలా పవర్ ఫుల్‌గా ఉంటాయి. ‘పుష్ప’ కోసం మరింత శ్రద్ధ పెట్టి విలన్ పాత్రను తీర్చిదిద్దినట్లుగా సమాచారం. ఈ పాత్రకు ముందుగా విజయ్ సేతుపతి పేరు ప్రచారంలోకి వచ్చింది. బన్నీ వెర్సస్ సేతుపతి కాంబో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఏవో కారణాల వల్ల సేతుపతి ఈ సినిమాలో నటించలేకపోయాడు.
ఆ తర్వాత అరవింద్ స్వామి, బాబీ సింహా, బాబీ డియోల్ లాంటి నటుల్ని పరిశీలించారు. చివరికి అనూహ్యంగా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ఎంచుకున్నారు. ఈ మధ్య ఓటీటీల్లో మలయాళ సినిమాల్ని బాగా చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఫాహద్ ప్రతిభ గురించి బాగానే తెలుసు. కళ్లతోనే అద్భుతమైన భావాలు పలికించి ప్రేక్షకులను కట్టి పడేసే నైపుణ్యం అతడి సొంతం.
ఫాహద్ నటన గురించి ఎవరు మాట్లాడినా.. అతను కళ్ల గురించి కచ్చితంగా మాట్లాడతారు. ‘కుంబలంగి నైట్స్’, ‘జోజి’ లాంటి చిత్రాలతో అతను కళ్లతోనే నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా చూపించాడు. అతడి బలమే అది. ఆ బలాన్ని సుకుమార్ కూడా గుర్తించినట్లున్నాడు. ఈ రోజు ఫాహద్ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప’ టీం ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అతడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. అందులో కేవలం ఫాహద్ ఒక కంటిని మాత్రమే చూపించారు. అది చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రేక్షకులకు. మోస్ట్ డేంజరస్ విలన్ అని పేర్కొనడం ద్వారా ఈ పాత్రపై ఇంకా అంచనాలు పెంచారు.
అసలే సుకుమార్.. ఆపై ఫాహద్.. ఇక ఈ పాత్ర ఏ రేంజిలో పేలుతుందో అర్థం చేసుకున్నాడు. ఈ మధ్యనే ఫాహద్ హైదరాబాద్‌కు వచ్చి ఈ సినిమా కోసం లుక్ టెస్ట్‌కు హాజరయ్యాడు. మూడు రోజుల పాటు ఆ పని నడిచింది. అప్పుడు చేసిన ఫొటో షూట్ నుంచే తాజా లుక్ రిలీజ్ చేసినట్లు కనిపిస్తోంది. త్వరలోనే అతను షూటింగ్‌కు హాజరు కాబోతున్నాడు.
This post was last modified on August 8, 2021 7:09 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…