కొన్ని నెలల కిందట జరిగిన ప్రచారమే నిజమవుతున్నట్లుంది. మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించబోతున్నట్లు జోరుగానే వార్తలొస్తున్నాయి. కంత్రి, బిల్లా, శక్తి, షాడో చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్‌తో చిరంజీవి ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అది తమిళ సూపర్ హిట్ వేదాలంకు రీమేక్ అన్న విషయమూ విదితమే.
తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాలంలో హీరోయిన్ని మించి చెల్లెలి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. అక్కడ లక్ష్మీ మీనన్ ఆ పాత్రలో నటించింది. తెలుగులో ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారా అన్న ఆసక్తి ముందు నుంచి ఉంది. మధ్యలో కొన్ని రోజుల పాటు కీర్తి సురేష్ ఈ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత చప్పుడు లేదు. కాగా ఈ పాత్రకు కీర్తి ఖరారైనట్లుగా తమిళ ప్రముఖ పీఆర్వోలు తాజాగా ట్విట్టర్లో వరుసబెట్టి పోస్టులు పెడుతున్నారు.
దీన్ని బట్టి కీర్తినే ఈ సమాచారాన్ని మీడియాతో పంచుకుని ఉండొచ్చని తెలుస్తోంది. సౌత్ ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి.. రెగ్యులర్ గ్లామర్ పాత్రలకు పరిమితం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం ‘అన్నాత్తె’లో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. అందులోనూ ఆమెది హీరోకు చెల్లెలి పాత్రే అంటున్నారు. ఈలోపు వేదాలం రీమేక్‌లో చిరు చెల్లెలి పాత్రకు కీర్తి ఖరారైన విషయం బయటికొచ్చింది.
ఐతే ఈ సినిమా విషయంలో చిరు అభిమానులు ఏమంత సంతోషంగా లేరు. రొటీన్ మాస్ సినిమా కావడం.. పైగా మెహర్ రమేష్ డైరెక్షన్ అనేసరికి వారిలో నిరుత్సాహం కనిపిస్తోంది. చిరు చెల్లెలిగా కీర్తి అంటూ వేదాలం రీమేక్ అప్‌డేట్ పట్ల కూడా చిరు అభిమానులు నెగెటివ్‌గానే స్పందించారు. చిరు అసలీ సినిమా చేయడమే వాళ్లకు ఇష్టం లేకపోవడంతో ఇలా స్పందిస్తున్నట్లుంది. మరోవైపు కీర్తి అభిమానులు సైతం చిరుకు సోదరిగా ఆమె నటించడం పట్ల ఏమంత అసంతృప్తిగా ఉన్నట్లుగా లేరు. వాళ్లు కూడా ఈ అప్‌డేట్ విషయంలో నెగెటివ్ ట్వీట్లే వేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని, చిరు పుట్టిన రోజు దీని ప్రకటన ఉంటుందని వార్తలొస్తున్నాయి.
This post was last modified on August 8, 2021 10:55 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…