మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల విషయంలో జోరు పెంచారు. యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరు తన తదుపరి సినిమాగా ‘లూసిఫర్’ రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. ఆ తరువాత దర్శకుడు బాబీ, మెహర్ రమేష్ లతో కలిసి పనిచేయనున్నారు. ఏడాదికి మూడు సినిమాలు చేసేలా చిరు ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్ గా దర్శకుడు మారుతి కూడా చిరుకి కథ చెప్పారని.. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభుదేవా పేరు కూడా వినిపిస్తోంది. కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా సినిమాలు చేసి ఆ తరువాత మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా మారారు ప్రభుదేవా. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. తెలుగులో కూడా సినిమాలు చేశారు.
మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇప్పుడు ప్రభుదేవాకు మరో ఛాన్స్ ఇవ్వడానికి చిరు రెడీ అవుతున్నారట. ప్రభుదేవా రీమేక్ కథలను బాగా తీయగలరు. అందుకే చిరు ఇప్పుడు ఓ రీమేక్ కథను ప్రభుదేవాకి అప్పగించాలని చూస్తున్నారు. అయితే ఈ రీమేక్ ఏంటి..? ఏ భాషకు చెందినదనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూద్దాం!
This post was last modified on August 6, 2021 7:52 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…