బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రామ్ చరణ్ తో కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమా చేసింది. ఈ సినిమాల కోసం అమ్మడుకి కోటి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. మహేష్ సినిమాకి అయితే అటు ఇటుగా రూ.80 లక్షలు ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఈ బ్యూటీ ఛార్జ్ చేస్తోన్న రెమ్యునరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే. ‘కబీర్ సింగ్’ సినిమాతో కియారా రేంజ్ మారిపోయింది.
ఇప్పుడు ఆమె బాలీవుడ్ రూ.4 కోట్లకు దగ్గరగా రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తెలుగులో నటించడానికి కూడా అదే రేంజ్ లో అడుగుతుంది. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో కియారా అద్వానీ రూ.5 కోట్లు డిమాండ్ చేసిందట. కానీ ఫైనల్ గా నాలుగున్నర కోట్లకు ఒప్పించారట.
హీరోయిన్ రెమ్యునరేషనే ఈ రేంజ్ లో ఇస్తే.. ఇక హీరో, డైరెక్టర్ లకు ఎంతిస్తున్నారో మరి. దిల్ రాజు మాత్రం ఈ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన బ్యానర్ లో వస్తోన్న యాభైవ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ ను ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. కొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే నాలుగు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలనేది దర్శకనిర్మాతల ప్లాన్. మరి అనుకున్నట్లుగా సినిమాను పూర్తి చేస్తారో లేదో చూడాలి!
This post was last modified on August 5, 2021 9:36 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…