సురేఖా వాణి కూతురు రెడీ అంట!

సురేఖావాణి కుమార్తె సుప్రిత నెటిజన్లకు సుపరిచితమే. తల్లితో కలిసి దబ్ స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలలో సుప్రీత కనిపిస్తూ ఉంటుంది. ఆమెని హీరోయిన్ గా చూడాలనేది ఆమె తండ్రి కోరిక అట. సురేఖావాణి కూడా సుప్రీతకు హీరోయిన్ అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది. ఆ విషయాన్ని ఆమె అన్యాపదంగా బయటపెట్టింది.

యువ హీరోల సరసన నటించే ఏజ్ లో ఉన్న సుప్రీత మరి ఏ సినిమాతో మొదలుపెడుతుందో చూడాలి. బ్యాక్ గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ అవడం కష్టమని, ముఖ్యంగా హీరోయిన్లకి మరీ కష్టమని రాజశేఖర్ కూతుళ్లు, నాగబాబు కూతురు నిహారికని చూస్తే క్లియర్ అయింది. సురేఖావాణి కూతురిగా సుప్రీతకి అటెన్షన్ దక్కుతుంది. ఇక ఆపై ఆమెకి వచ్చే అవకాశాలపై కెరీర్ డిపెండ్ అవుతుంది.