ఎన్నో ఆశల మధ్య నాలుగు రోజుల కిందటే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభం అయ్యాయి. దేశంలోనే కరోనా సెకండ్ వేవ్ తర్వాత మెజారిటీ థియేటర్లు తెరుచుకున్నది తెలుగు రాష్ట్రాల్లోనే. తెలంగాణలో అయితే 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేశారు. వెండి తెరల్ని కళకళలాడించడానికి గత వారం రెండు కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి.
ఐతే అవి రెండూ చిన్న సినిమాలే కావడంతో ప్రి రిలీజ్ బజ్ పెద్దగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ మోస్తరుగానే ఉన్నాయి. ఇక ఈ రెండు చిత్రాలకు టాక్ ఆశించిన స్థాయిలో లేదు. ఉన్నంతలో ‘తిమ్మరసు’ పరిస్థితి మెరుగు. కొంత మిక్స్‌డ్ టాక్ ఉన్నప్పటికీ.. మరీ అసంతృప్తి అయితే లేదు. టికెట్ డబ్బులకు గిట్టుబాటు చేసే సినిమా అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ‘ఇష్క్’ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నం. ఈ మలయాళ రీమేక్‌ను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. మరీ బ్యాడ్ టాక్ వచ్చింది.
టాక్‌కు తగ్గట్లే రెండు కొత్త చిత్రాల బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఉంది. ‘ఇష్క్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా వాషౌట్ అయిపోయిందనే చెప్పాలి. తొలి రోజు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి కానీ.. రెండో రోజు నుంచి థియేటర్లు వెలవెలబోయాయి. థియేటర్ల మెయింటైనెన్స్ కూడా కష్టం అనేట్లుగా మరీ నామమాత్రపు షేర్ వచ్చిందీ సినిమాకు. యుఎస్‌లో సినిమాకు రెండో రోజు 200 డాలర్లు కూడా కలెక్షన్లు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
‘తిమ్మరసు’కు మాత్రం అక్కడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు పర్వాలేదు. ఓ మోస్తరు ఆక్యుపెన్సీతో సినిమా నడుస్తోంది. ఫస్ట్ షోలకు థియేటర్లు బాగానే నిండుతున్నాయి. సోమవారం తెలంగాణలో బోనాల పండుగ సెలవును ‘తిమ్మరసు’ బాగానే ఉపయోగించుకున్నట్లుంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు థియేటర్లు కళకళలాడాయి. ఉత్తరాంధ్రలో కూడా సినిమా బాగా ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఓవరాల్‌గా ‘తిమ్మరసు’ బ్రేక్ ఈవెన్‌కు చేరువగా ఉంది. సినిమా హిట్ స్టేటస్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on August 3, 2021 6:07 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…