మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మెగా బ్రదర్ నాగబాబుపై చర్యలు తప్పవని హెచ్చరించారు సంఘం అధ్యక్షుడు నరేష్. కొత్తగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, ఆయన ప్యానెల్‌కు మద్దతుగా మాట్లాడుతూ.. గత కార్యవర్గంపై నాగబాబు విమర్శలు చేయడం తెలిసిందే. టీవీ చర్చల్లోనే కాక.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టినపుడు కూడా నాగబాబు ‘మా’ గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ప్రతిష్ఠ మసకబారింది’’ అనే నాగబాబు వ్యాఖ్యల పట్ల నరేష్ ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తననెంతో బాధించాయని అన్నారు.
‘మా’కు సంబంధించి మంచి ఉంటే మైకులో చెప్పాలని.. చెడు ఉంటే చెవిలో చెప్పాలని గతంలో ఒక సమావేశం సందర్భంగా చిరంజీవి అన్నారని.. మరి నాగబాబు ఇలా బహిరంగంగా చెడుగా ఎలా మాట్లాడారని నరేష్ ప్రశ్నించారు. ‘మా’ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవాలని నిబంధనల్లో ఉందని.. కాబట్టి చిరంజీవి, కృష్ణం రాజు లాంటి పెద్దలతో కూడిన క్రమశిక్షణ కమిటీ విమర్శలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటుందని నరేష్ అన్నారు. ప్రకాష్ రాజ్‌కు చిరంజీవి మద్దతు ఉందని నాగబాబు మాత్రమే అన్నారని.. ఆ మాట చిరంజీవి చెప్పలేదు కదా అని నరేష్ వ్యాఖ్యానించారు.
‘మా’ అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం అయితే అది మహా పాపం అన్నట్లు నాగబాబు మాట్లాడారని.. కానీ ఈ ఎన్నికలు ఏకగ్రీవం అయితే తప్పేంటని నరేష్ ప్రశ్నించారు. ‘మా’ పెద్దలంతా కలిసి అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే దాన్ని తాను అంగీకరిస్తానని.. అంతే కాక ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానని మంచు విష్ణు అన్నాడని.. అది అభినందించదగ్గ విషయం అని.. ‘మా’ భవనం కోసం తాను కూడా తన వంతు సాయం చేస్తానని నరేష్ అన్నారు. తాను మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తే కచ్చితంగా తెలుస్తానని.. కానీ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే పోటీ నుంచి తప్పుకుంటున్నానని నరేష్ మరోసారి నొక్కి వక్కాణించారు.
This post was last modified on August 3, 2021 12:48 pm
ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే…
అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు…
2024 ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నాటి నుంచి ఎందుకనో గానీ… వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల…
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ జే. ట్రంప్ పదవీ ప్రమాణం చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఏర్పాటు…
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…