టాలీవుడ్లో మరోసారి వరుసగా భారీ చిత్రాల రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల విషయంలో పెద్ద చిత్రాల మధ్య భారీ పోటీనే ఉండబోతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ఖరారయ్యాయి.
రాధేశ్యామ్, సర్కారు వారి పాట చిత్రాలకు డేట్లు కూడా ఇచ్చేయగా.. పవన్ కళ్యాణ్-రానాల సినిమాను కూడా సంక్రాంతికి ఖరారు చేయడం తెలిసిందే. ఎఫ్-3 సైతం రేసులోనే ఉంది. ఇక కరోనా మూడో వేవ్ ప్రభావం పెద్దగా లేకుంటే ముందుగా దసరాతో భారీ చిత్రాల సందడి మొదలవుతుంది.
ఆ పండక్కి ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రాన్ని క్రిస్మస్ పండక్కి ఫిక్స్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.
డిసెంబరు చివరి వారంలో సినిమాను రిలీజ్ చేస్తే.. క్రిస్మస్ సెలవులతో పాటు కొత్త సంవత్సరాది సందడి కూడా కలిసొస్తుందని.. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు రెండు వారాల పాటు బాక్సాఫీస్‌ను రూల్ చేయొచ్చని పుష్ప టీం యోచిస్తున్నట్లు సమాచారం.
పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం ఫస్ట్ పార్ట్ చివరి షెడ్యూల్ చిత్రీకరణ సాగుతోంది. మధ్యలో సుకుమార్‌కు డెంగీ సోకడంతో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ ఆగింది. మళ్లీ షూటింగ్ పునఃప్రారంభిస్తున్నారు. ఇంకో నెలా నెలన్నరలో టాకీ పార్ట్ పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఆ తర్వాత ప్రి ప్రొడక్షన్ పనిలో పడతారు. ఇప్పటికే పుష్ప ప్రమోషనల్ ప్లాన్ కూడా రెడీ చేశారు. ఇందులో భాగంగానే సినిమా నుంచి మేక మేకా అంటూ సాగే తొలి పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకేసారి ఐదు భాషల్లో ఈ పాట రిలీజవుతోంది. సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లో ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 2, 2021 10:46 pm
అమీర్ ఖాన్ గంపెడాశలు పెట్టుకున్న సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలయ్యింది. రిలీజ్ డేట్ ఇంకా నెల రోజులకు పైగానే…
మొన్నటి ఏడాది నాని హాయ్ నాన్నతో ఎమోషనల్ హిట్టు కొట్టిన దర్శకుడు శౌర్యువ్ కొత్త సినిమా ఎవరితో చేస్తాడనే సస్పెన్స్…
ఈ రోజుల్లో సౌత్ ఇండియన్ సినిమాలన్నీ దాదాపుగా థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఏవో కొన్ని పాన్ ఇండియా…
https://www.youtube.com/watch?v=YH6k5weqwy8 అమీర్ ఖాన్ గంపెడాశలు పెట్టుకున్న సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలయ్యింది. రిలీజ్ డేట్ ఇంకా నెల రోజులకు…
వైసీపీ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ…