వచ్చే సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోయానని అనుకుంటుంటే.. ఉన్నట్లుండి ఇప్పుడు ‘రాధేశ్యామ్’ లైన్లోకి వచ్చింది. ఇప్పటికే సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్-రానాల మూవీ సంక్రాంతికి విడుదల ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. వీలును బట్టి ‘ఎఫ్-3’ని కూడా రేసులోకి నిలపాలనుకుంటున్నారు. కానీ అనూహ్యంగా ‘రాధేశ్యామ్’ సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఏకంగా జనవరి 14న అంటూ రిలీజ్ డేట్ సైతం ఇచ్చేశారు.
జులై 30న రావాల్సిన సినిమాకు కరోనా బ్రేక్ వేస్తే.. దసరానో దీపావళినో టార్గెట్ చేస్తారులే అనుకుంటే.. ఊహించని విధంగా సంక్రాంతి రేసులోకి వచ్చిందీ చిత్రం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్ల సినిమాలు ఒకే పండక్కి రావడమే అరుదైన విషయం. అక్కడికే బాక్సాఫీస్ కావాల్సినంత హీటెక్కిపోతుంది. అలాంటిది ‘బాహుబలి’ తర్వాత ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా మారిన ప్రభాస్ కూడా రేసులో నిలిస్తే ఇక బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టం.
ఐతే ఇలా ముగ్గురు సూపర్ స్టార్లు ఒకేసారి పోటీ పడటం కరెక్టేనా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది ఇప్పుడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి రెండు భారీ చిత్రాలను రిలీజ్ చేస్తేనే వాటికి థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమైంది. రెంటికీ పాజిటివ్ టాక్ రాబట్టి, టికెట్ల రేట్లు పెంచబట్టి సరిపోయింది కానీ.. లేదంటే ఇలా రెండు భారీ చిత్రాలు రిలీజైనపుడు ఒకదానికి పాజిటివ్ టాక్ వచ్చి, ఇంకోదానికి నెగెటివ్ టాక్ వస్తే అది అన్యాయం అయిపోతుంది. అందులోనూ వచ్చే సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు రేసులోకి వస్తున్నాయి. ఫ్యామిలీస్, మెజారిటీ ఆడియన్స్ మూడు సినిమాలూ చూడరు. అందులో బాగున్న ఒకటో రెండో సినిమాలు చూస్తారు.
ఒకవేళ పై మూడు చిత్రాల్లో ఏదైనా ఒక సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందంటే అంతే సంగతులు. ఓపెనింగ్స్ కూడా ఉండవు. దారుణమైన దెబ్బ పడుతుంది. సంక్రాంతి రేసులో ఉన్న మూడూ భారీ బడ్జెట్ చిత్రాలే. వాటిపై భారీగా పెట్టుబడి పెట్టి రిస్క్ చేస్తున్నారు. అలాంటపుడు ఏదైనా తేడా జరిగితే అంతే సంగతులు. బ్యాండ్ మామూలుగా ఉండదు.
This post was last modified on August 1, 2021 7:55 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…