పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట ఇది. ‘బాహుబలి’ దగ్గర్నుంచి ఇది పాపులర్ అయింది. ఏదో ఒక భాషకు పరిమితం కాకుండా బహుభాషల్లో ఒకేసారి సినిమా తీసి.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేయడమే ‘పాన్ ఇండియా’ అంటే. బహు భాషా చిత్రాలు తీయడం.. గతంలోనూ ఈ తరహాలో సినిమాలు తెరకెక్కడం, రిలీజ్ కావడం జరిగింది కానీ.. గత కొన్నేళ్లలో ఈ ట్రెడిషన్ బాగా ఊపందుకుంది.
ఐతే 90ల్లో వరుసబెట్టి హిందీ సినిమాలు చేసిన అక్కినేని నాగార్జున అప్పట్లోనే ఓ భారీ పాన్ ఇండియా మూవీలో నటించాల్సిందట. అందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయిందని ఆ చిత్రాన్ని నిర్మించాల్సిన సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘దుర్గా ఆర్ట్స్’ బేనర్ మీద కె.ఎల్.నారాయణతో కలిసి గోపాల్‌రెడ్డి సినిమాలు నిర్మించేవారన్న సంగతి తెలిసిందే. ఆ బేనర్లోనే ఆ చిత్రం తెరకెక్కాల్సిందట. ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలపై గోపాల్‌రెడ్డి ఏమన్నారంటే..
“నాగార్జునతో అప్పట్లో ఒక పాన్ ఇండియా చేయాలనుకున్నాం. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అశోక్ మెహతా రాసిన స్ర్కిప్టు అది. 48 గంటల వ్యవధిలో ముగిసిపోయే.. రేసీ స్క్రీన్ ప్లేతో నడిచే కథ అది. తనకి విషం ఎక్కించిన ముగ్గురు విలన్లని హీరో చంపాలి. ఒక్కో విలన్ ఒక్కో రాష్ట్రంలో ఉంటాడు. వారిని అన్వేషించే మార్గంలో హీరో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇందులో నటించేందుకు డింపుల్ కపాడియా, అనుపమ్ ఖేర్ తదితరుల్ని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది. వారంలో సినిమా ప్రారంభం కావాల్సిన సమయంలో చిన్న సందేహం కలిగింది. నాకూ కె.ఎల్. నారాయణకి, నాగార్జున సోదరుడు వెంకట్‌కి కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తే బాగుంటుందనిపించింది. అదే విషయం అశోక్ మెహతాకు చెప్పాం. కానీ ఆయన అందుకు ససేమిరా అన్నారు. దీంతో ఆ సినిమా ఆగిపోయింది” అని గోపాల్ రెడ్డి వివరించారు. చాలా ఏళ్లుగా కెమెరా పక్కన పెట్టేసి, ప్రొడక్షన్‌కు కూడా దూరంగా ఉన్న గోపాల్ రెడ్డి.. వచ్చే ఏడాది తమ సంస్థలో తెరకెక్కనున్న మహేష్ బాబు-రాజమౌళి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.
This post was last modified on August 1, 2021 11:50 am
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…