త్రివిక్రమ్ మల్టీస్టారర్.. ఎవరితో అంటే?

ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఎన్టీఆర్ సినిమా కంటే ముందు వేరే చిత్రం చేయబోతున్నాడా? ఇప్పటిదాకా ఎన్నడూ ప్రయత్నించని మల్టీస్టారర్ మూవీతో మాటల మాంత్రికుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడా? ఇండస్ట్రీ జరుగుతున్న ప్రచారం చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ‘అల వైకుంఠపురములో’ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాల్సి ఉంది.

కానీ ‘ఆర్ఆర్ఆర్’ ఆలస్యమవుతుండటంతో త్రివిక్రమ్ కొన్ని నెలల పాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ గ్యాప్‌లో ఒక సినిమా లాగించేయాలని మాటల మాంత్రికుడు చూస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా హారిక హాసిని బేనర్లో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ముందుకు కదల్లేదు.

ఐతే ఇప్పుడు దొరికిన గ్యాప్‌లో ఆ చిత్రాన్నే లాగించేయాలని త్రివిక్రమ్ చూస్తున్నాడట. ఐతే ఈ సినిమాలో వెంకీకి తోడుగా మరో హీరోను కూడా తీసుకొస్తున్నాడట ఆయన. ఆ హీరో నేచురల్ స్టార్ నాని అన్నది లేటెస్టుగా వినిపిస్తున్న కబురు. నాని ఇప్పటిదాకా పెద్ద దర్శకులెవరితోనూ పూర్తి స్థాయి సినిమా చేయలేదు. రాజమౌళితో ‘నాని’ చిత్రంలో తక్కువ నిడివి ఉన్న క్యారెక్టర్ మాత్రమే చేశాడు.

స్టార్ డైరెక్టర్ చేతిలో పడితే నాని రేంజే మారిపోయేదన్న అభిప్రాయాలున్నాయి. మరోవైపు వెంకీ సైతం స్టార్ డైరెక్టర్లతో పని చేసి చాలా కాలం అవుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ నాన్-బాహుబలి హిట్ ఇచ్చిన త్రివిక్రమ్‌తో సినిమా సెట్టయిందంటున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజముందో చూడాలి. ప్రస్తుతం నాని ‘టక్ జగదీష్’ అనే సినిమాను లైన్లో పెట్టగా.. వెంకీ ‘నారప్ప’ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.