హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘రంగస్థలం’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అందులో ‘రంగమ్మత్త’గా అనసూయ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. రెమ్యునరేషన్ కోసం కాకుండా.. సరికొత్త కథలతో ప్రేక్షకులను అలంరించాలని సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. అలానే సక్సెస్ లు అందుకుంటుంది.
తాజాగా ఆమె మరో సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదొక ఆంథాలజీ కాన్సెప్ట్ తో తెరకెక్కబోయే సినిమా. ఆరు కథల సమ్మేళనమే ఈ సినిమా. గతంలో ‘పేపర్ బాయ్’, ‘విటమిన్ షి’ వంటి సినిమాలకు పని చేసిన జయశంకర్.. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెల నుండి అనసూయ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వనుంది.
ఇందులో ఆమె ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుందని సమాచారం. మొత్తం ఆరు కథల్లో అనసూయ పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలకు భిన్నంగా ఈ రోల్ ఉంటుందట. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందిస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on July 30, 2021 1:47 pm
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…