అప్పుడప్పుడూ ఇండస్ట్రీలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. పెద్దగా పేరు లేని కాస్ట్ అండ్ క్రూతో తెరకెక్కిన చిత్రాలు అనూహ్య విజయం సాధిస్తుంటాయి. ఆ సినిమాలకు రిలీజ్ ముంగిట అనుకోకుండా మంచి బజ్ వస్తుంది. ఓపెనింగ్స్ వస్తాయి. బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొచ్చి ఆ చిత్రాలు అంచనాలను మించి ఆడేస్తుంటాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఈ కోవలోకే చేరుతుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘రాజా వారు రాణి వారు’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరపు హీరోగా నటించిన చిత్రమిది. ఈ చిత్రానికి అతనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చడం విశేషం. పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేకపోయినా.. తొలి సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా.. కిరణ్‌కు మంచి క్రేజే వచ్చింది. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో పాటు ఇంకో రెండు సినిమాల్లో అతను అవకాశం అందుకున్నాడు.
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ గత ఏఢాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఐతే ‘నారప్ప’ లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్ల కోసం ఎదురు చూడలేక ఓటీటీ బాట పడితే.. ఈ చిత్రానికి ఓటీటీల మంచి ఆఫర్లు వచ్చినా టెంప్ట్ కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టి కూర్చున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేట్రికల్ రిలీజ్ గురించి ముందుగా ప్రకటన వచ్చింది ఈ చిత్ర బృందం నుంచే. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ అంచనాలు రేకెత్తించగా.. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. అది కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉండటం.. కమర్షియల్ అంశాలకు లోటు లేకపోవడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.
ట్రైలర్లో కిరణ్ కాన్ఫిడెన్స్, అతడి పాత్రకు ఇచ్చిన ఎలివేషన్లు చూస్తే ఇదొక స్టార్ మూవీ అన్న ఫీలింగ్ కలుగుతోంది. కుర్రాడు గట్టిగా కొట్టేలా ఉన్నాడే అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి ట్రైలర్ చూసి. సెకండ్ వేవ్ తర్వాత రీస్టార్ట్ మూవీస్‌గా వస్తున్న ఇష్క్, తిమ్మరసులను మించి తర్వాతి వారం వచ్చే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మీదే అంచనాలు ఎక్కువ ఉండటం విశేషం. అంచనాలకు తగ్గట్లు సినిమా ఉంటే.. ఇండస్ట్రీకి షాకిచ్చే లెవెల్లో ఈ సినిమా హిట్టవుతుందేమో.
This post was last modified on July 28, 2021 3:15 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…