కరోనా పుణ్యమా అని సినిమాల షెడ్యూళ్లు ఎలా పడితే అలా మారిపోతున్నాయి. గత ఏడాది కాలంలో ఎన్ని సినిమాలు రిలీజ్ డేట్లు మార్చుకుని అయోమయ స్థితిలో పడ్డాయో తెలిసిందే. ఈ వేసవికి ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. గత ఏడాది లాగే సమ్మర్ సీజన్ వెలవెలబోయింది. కరోనా సెకండ్ వేవ్ రావడానికి ముందు ఈ ఏడాది మొత్తానికి కీలకమైన సీజన్లకు బెర్తులు ఫిల్ అయిపోయాయి. వచ్చే సంక్రాంతి సినిమాల విషయంలోనూ ముందే ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ సెకండ్ వేవ్ దెబ్బకు మళ్లీ షెడ్యూళ్లన్నీ తేడా కొట్టేశాయి.
గత కొన్ని నెలల్లో షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్లు మూతపడటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీ రీస్టార్ట్ కావడంతో రిలీజ్ డేట్లపై మళ్లీ క్లారిటీ వస్తోంది. వచ్చే సంక్రాంతికి ఏ సినిమాలు వస్తాయో దాదాపుగా ఒక అంచనా వచ్చేసినట్లే.
మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట ముందు అనుకున్నట్లే 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఆ సినిమా పని పునఃప్రారంభం అయింది. ఇప్పుడు వేసుకున్న ప్రణాళికలు అనుకున్నట్లుగా అమలైతే సంక్రాంతికి ఈ సినిమా రావడం ఖాయం. ఐతే దీనికి పోటీగా రావాల్సిన పవన్ కళ్యాణ్-క్రిష్ చిత్రం హరిహర వీరమల్లు మాత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లే. ఆ సినిమా అప్పటికి సిద్ధమయ్యే సూచనలు లేవు.
పైగా పవన్ నటిస్తున్న మరో చిత్రం అయ్యప్పనుం కోషీయుం రీమేక్.. కొత్తగా సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో హరిహర వీరమల్లు సంక్రాంతికి లేనట్లే. ఇక ఫ్యామిలీ ఫన్ మూవీ ఎఫ్-3ని ఆగస్టులోనే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. అది కూడా డేట్ మార్చుకోక తప్పట్లేదు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తే పర్ఫెక్ట్ అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ మూడు చిత్రాలు సంక్రాంతికి ఖరారైనట్లుగా భావిస్తున్నారు. విజయ్ డబ్బిగ్ మూవీ బీస్ట్ సైతం సంక్రాంతి రేసులో నిలిచే అవకాశముంది.
This post was last modified on July 28, 2021 11:51 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…