టాలీవుడ్ స్టార్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని స్పీడే స్పీడు. ఏ స్థాయి సినిమా అయినా సరే.. శరవేగంగా పూర్తి చేసేస్తుంటాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్, శ్రమతో కూడుకున్న చిత్రం. అయినా సరే.. ఈ సినిమాను చాలా వేగంగా లాగించేశాడు. ఈ చిత్రం మొదలైందే ఈ ఏడాది. కరోనా వల్ల బ్రేకులు పడ్డాయి. అయినా సరే.. నాని జోరు తగ్గలేదు. కరోనా బ్రేక్ తర్వాత షూటింగ్‌కు అనుమతలు లభించగానే పని మొదలుపెట్టేశాడు. కొన్ని రోజుల్లోనే సినిమాను ముగించాడు. సోమవారమే ‘శ్యామ్ సింగ రాయ్’కు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సందర్భంగా నాని స్వయంగా అప్‌డేట్ ఇవ్వడం తెలిసిందే.
ఐతే ఒక సినిమా పూర్తయింది కదా.. కొంచెం గ్యాప్ తీసుకుందామనేమీ నాని అనుకోలేదు. వెంటనే తన కొత్త చిత్రం ‘అంటే సుందరానికి..’ కోసం రెడీ అయిపోయాడు. ఈ సినిమాను మొదలుపెడుతున్న విషయాన్ని వెల్లడిస్తూ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశాడు.
‘శ్యామ్ సింగరాయ్’ కోసం నాని మీసం పెంచడం తెలిసిందే. కోర మీసంతో కొత్తగా కనిపించాడతను. ఈ ఏడాది ఆరంభం నుంచి నాని అదే లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఐతే ఈ సినిమా పూర్తయి.. ‘అంటే సుందరానికి..’ మొదలవుతుండంతో మీసం తీసేశాడు. అంటే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోయే సినిమాలో సుందరంగా నాని మీసం లేకుండా క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడన్నమాట. శ్యామ్ సింగరాయ్ నుంచి సుందరంగా మారుతున్న విషయాన్ని భలే సరదాగా ఈ వీడియోలో చూపించాడు నాని.
‘శ్యామ్ సింగరాయ్’కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని అంటున్నారు. దసరా టైంకి సినిమా రెడీ కావచ్చంటున్నారు. ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అనే కొత్త నిర్మాణ సంస్త ప్రొడ్యూస్ చేసింది. ‘అంటే సుందరానికి..’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on %s = human-readable time difference 5:02 pm
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో లోకేష్ కనకరాజ్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. అతడి వల్లే సినిమాటిక్ యూనివర్శ్…
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా…
సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. తనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లు ఎంతో…
తండేల్ విడుదల తేదీ సస్పెన్స్ కు చెక్ పెడుతూ ఫిబ్రవరి 7 అఫీషియల్ గా ప్రకటించారు. నిన్నే ఇది లీకైనప్పటికీ…
రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి…
ఏదైనా వేదిక ఎక్కి మైక్ పట్టుకున్నపుడు, మీడియా ముందు మాట్లాడుతున్నపుడు కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నోటికి…