టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసుకు ఇంటర్నెట్లో చేదు అనుభవం ఎదురైంది. తన కుటుంబం గురించి తప్పుడు ప్రచారం జరగడంపై ఆయన మనస్తాపం చెందాడు. ఈ ప్రచారం వల్ల తన కూతురిని చంపేస్తానంటూ ఒక వ్యక్తి బెదిరిస్తూ వీడియో పెట్టడంపై వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై వాసు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు లేఖ రాయడం గమనార్హం. సామాజిక మాద్యమాల్లో తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె, తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించినట్లు ఈ లేఖలో వాసు వెల్లడించాడు. ఒకరు పెట్టిన పోస్టు అబద్ధమని నిరూపించడం చాలా కష్టతరం అని, అదేంటో స్వయంగా తాను ఫేస్ చేశానని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.
తన కూతురిని చంపుతానని ఓ వ్యక్తి సామాజిక మాద్యమాల్లో వీడియో పెడితే.. దాన్ని తీయించడానికి తల ప్రాణం తోకకు వచ్చిందని, చిత్ర పరిశ్రమలో ఎంతో కొంత పలుకుబడి ఉన్న తనకే ఇంత కష్టమైతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని నేరుగా సుందర్ పిచాయ్‌ని ఈ లేఖలో ప్రశ్నించాడు వాసు. ఇంటర్నెట్ స్వేచ్ఛకు మద్దతుగా ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బన్నీ వాసు ఈ లేఖ రాశాడు.
అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకడు. అల్లు అరవింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ వ్యవహారాలన్నీ ఇప్పుడు బన్నీ వాసు కనుసన్నల్లోనే నడుస్తాయి. గీతా ఆర్ట్స్-2 బేనర్లో తెరకెక్కే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు నిర్మాతగా బన్నీ వాసు పేరే పడుతుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉంది.
This post was last modified on July 26, 2021 8:21 am
భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన…
రీ రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి వింటేజ్ సినిమాలను థియేటర్ లో అనుభూతి చెందాలనే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. నిన్న…
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,మాపో…
నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’తో తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు. గత వారం విడుదలైన ఈ చిత్రం..…
మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న…
నాలుగేళ్ల కిందట మోడీని చంపేస్తామని.. ఆయన తల తెచ్చిన వారికి బహుమానం ఇస్తామని లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన…