మెగాహీరో కోసం తమన్నా ఐటెమ్ సాంగ్!

Thamanna

మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న ‘గని’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి బాక్సింగ్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం వరుణ్ తన లుక్ ని మార్చుకోవడంతో పాటు బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. హైదరాబాద్ లో ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ ‘గని’ షూటింగ్ స్పాట్ లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సంగతి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఐటమ్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ కనిపించబోతుందట. గతంలో ‘కేజీఎఫ్’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించిన తమన్నా ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి ఆడిపాడుతోంది. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల తరువాత ఈ ఐటమ్ సాంగ్ వస్తుందట. ఈ పాటలో తమన్నా డాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.

గతంలో తమన్నా, వరుణ్ తేజ్ కలిసి ‘ఎఫ్ 2’ సినిమాలో కనిపించారు. అందులో వరుణ్ కి వదిన పాత్రలో కనిపించింది తమన్నా. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తున్నారు. ‘గని’ సినిమా పూర్తవ్వగానే.. వరుణ్ తన లుక్ మార్చుకొని ‘ఎఫ్ 3’ షూటింగ్ లో పాల్గొనున్నారు.