తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెంగల్ పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్ ను కారు ఢీ కొట్టడంతో బిగ్ బాస్ ఫేమ్, నటి యాషిక ఆనంద్ సహా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. యాషిక స్నేహితురాల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వల్లిశెట్టి భవాని అక్కడికక్కడే మృతి చెందారు. జూలై 25న రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
వేగంగా దూసుకుపోయిన కారు డివైడర్ ని ఢీ కొట్టి పక్కనే ఉన్న గోతిలో పడిపోయింది. అదే రోడ్డులో ప్రయాణిస్తున్న కొందరు ఈ ప్రమాదం చూసి షాకయ్యారు. వెంటనే తేరుకొని కారులో నుండి యాషికాను ఆమె స్నేహితులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వల్లిశెట్టి భవాని కారులోనే ఇరుక్కుపోయి మరణించారు.
భవాని మృతదేహాన్ని అటాప్సీ కోసం చెంగల్ పట్టు హాస్పిటల్ కు తరలించారు. మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యాషిక ఆనంద్ తమిళనాడులో మోడల్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత ‘కావలై వెండమ్’, ‘నోటా’, ‘ధ్రువంగల్ పతినారు’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు తమిళ సినిమాలున్నాయి.
This post was last modified on July 25, 2021 11:57 am
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…