టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. సుకుమార్ కి వైరల్ ఫీవర్ రావడంతో మూడు రోజులుగా జరగాల్సిన షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు సుకుమార్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట. సుకుమార్ మొదటి నుండి కూడా ఇంగ్లీష్ మందులకు దూరంగా ఉంటారు. ఒక్కో హోమియోపతి మాత్రమే వాడుతుంటారు.
ఈసారి కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. కానీ ఇంకా అనారోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం సెట్ అయ్యేవరకు కూడా ‘పుష్ప’ షూటింగ్ మొదలుకాదు. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోనే సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ విడుదలైన ఆరు నెలల తరువాత సెకండ్ పార్ట్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు భాగాల షూటింగ్ పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ ను వదలకూడదని సుకుమార్ అనుకుంటున్నారు. కానీ బన్నీ మాత్రం మధ్యలో ఓ సినిమా పూర్తి చేయాలనుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on July 24, 2021 12:37 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…