(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలకు సంబంధించి కొన్ని రోజుల హడావుడి తర్వాత పరిస్థితి కొంచెం స్తబ్దుగా మారగా.. ఇప్పుడు మళ్లీ వేడి కాస్త రాజుకుంటోంది. ఇందుక్కారణం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు ఇస్తున్న స్టేట్మెంట్లు.. టీవీ ఛానెళ్ల చర్చల్లో చేస్తున్న వ్యాఖ్యలే. జైళ్లలో ఉండాల్సిన కొందరు బయట తిరుగుతున్నారంటూ ‘మా’లో భాగమైన కొందరిని ఉద్దేశించి విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపిన సంగతి తెలిసిందే.
‘మా’ పెద్దలు ఎన్నికలు ఏకగ్రీవం కావాలని కోరుకుంటే.. వారి నిర్ణయాన్ని శిరసావహిస్తానని.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని విష్ణు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐతే ఏకగ్రీవంగా ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైతే బాగుంటుందన్న విషయంలో విష్ణు చేసిన కామెంట్ సైతం ఆసక్తి రేకెత్తించేదే. నందమూరి బాలకృష్ణ అధ్యక్షుడిగా ఎన్నికైతే బాగుంటుందని.. ఆయనైతే ‘మా’కు మంచి చేస్తారని విష్ణు వ్యాఖ్యానించడం విశేషం.
ఈసారి ‘మా’ అధ్యక్ష పదవి పోటీకి ముందుగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ప్రకాష్ రాజ్‌కు ‘మెగా’ ఫ్యామిలీ మద్దతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా నాగబాబే ప్రకాష్ రాజ్‌కు మద్దతు ప్రకటించాడు. చిరంజీవి మద్దతు కూడా ఆయనకున్నట్లుగా ప్రకటించాడు. ప్రకాష్ రాజ్ తరఫున ప్రెస్ మీట్లో పాల్గొనడంతో పాటు మీడియాలోనూ బ్యాటింగ్ చేస్తున్నాడు నాగబాబు.
ఈ నేపథ్యంలో మంచు విష్ణు పోటీలోకి రాగానే అతడికి బాలయ్య మద్దతున్నట్లుగా మాట్లాడుకున్నారు. బాలయ్య సైతం ఈ దిశగా సంకేతాలు ఇచ్చాడు. దీంతో ‘మా’ ఎన్నికల విషయంలో సినీ పరిశ్రమ రెండుగా విడిపోయిందనే మాట కూడా తెరపైకి వచ్చింది.
ఇప్పుడు మంచు విష్ణు.. బాలయ్య పేరెత్తి, ఆయన అధ్యక్షుడైతే బాగుంటుందనడం ద్వారా తనకు ఆయన మద్దతు ఇస్తున్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లయింది. కాబట్టి ఎన్నికలు జరిగితే మెగా వెర్సస్ నందమూరి పరోక్ష పోరు చూడటం ఖాయమేమో.
This post was last modified on July 22, 2021 5:46 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…