యన్.టి.ఆర్: కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలతో కెరీర్లో ఊహించని పతనం చూశాడు నందమూరి బాలకృష్ణ. ఆయన కెరీర్ ఇక ముగిసినట్లే అన్న వ్యాఖ్యానాలు వినిపించాయి ఆ టైంలో. ఈ మూడు చిత్రాలకు కలిపి రూ.20 కోట్ల షేర్ కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాలయ్య మార్కెట్ దారుణంగా దెబ్బ తిన్నట్లు కనిపించింది ‘రూలర్’ టైంలో.
ఇక్కడి నుంచి బాలయ్య ఎలా పుంజుకుంటాడో అని అందరూ సందహాలు వ్యక్తం చేశారు. ఐతే ఒకప్పుడు పతావస్థలో ఉండగా ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి చిత్రాలతో తన కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోసిన బోయపాటి శ్రీనుతో జట్టు కట్టడం ద్వారా పునర్వైభవానికి బాటలు పరుచుకున్నాడు బాలయ్య.
వీరి కలయికలో వస్తున్న ‘అఖండ’ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు టీజర్లు మాంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. బాలయ్యకు మళ్లీ ఊపు తెచ్చాయి. ఈ చిత్రానికి అనూహ్యమైన స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
ఈ ఊపులో బాలయ్య క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘అఖండ’తో పాటు ఆల్రెడీ కమిటైనవి, ప్లానింగ్‌లో కలిపితే ప్రస్తుతం బాలయ్య బాలయ్య ఖాతాలో అరడజను సినిమాలున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ‘క్రాక్’ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీస్ నిర్మాణంలో ఓ సినిమా ఓకే అయింది.
అలాగే అనిల్ రావిపూడితో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు. దాన్ని షైన్ స్క్రీన్స్ వాళ్లు నిర్మిస్తారు. కాగా మరో అగ్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని బేనర్లో ఓ సినిమా చేయబోతున్నట్లు బాలయ్య ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి వెంకీ కుడుమల దర్శకుడు అని ప్రచారం సాగుతుండటం విశేషం. బాలయ్య-వెంకీ కలయికలో సినిమా ఎవ్వరూ ఊహించనిదే.
మరోవైపు ‘పైసా వసూల్’ తర్వాత పూరి జగన్నాథ్‌తో మరో సినిమా చేస్తానన్న బాలయ్య.. ఆ దిశగా సన్నాహాలు చేసుకోమని పూరీకి చెప్పినట్లు సమాచారం. ఇంకోవైపేమో ‘ఆదిత్య 369’ సీక్వెల్ కూడా చేస్తానని మళ్లీ మళ్లీ నొక్కి వక్కాణిస్తున్నాడు బాలయ్య. ఇలా మొత్తం బాలయ్య చేతిలో ఉన్న సినిమాల సంఖ్య అరడజనుగా కనిపిస్తోంది.
This post was last modified on July 21, 2021 9:45 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…