శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయిపోయాడు. అతడికి వివాదాలు కొత్తేమీ కాదు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమానిగా ఉంటూ బెట్టింగ్‌కు పాల్పడి నిషేధం ఎదుర్కొన్న చరిత్ర అతడిది. ఇప్పుడు పోర్న్ సినిమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ.. వాటిని కొన్ని మొబైల్ యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా రాజ్ కుంద్రా అభియోగాలు ఎదుర్కోవడం.. ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల చేతిలో అరెస్టవడం తెలిసిందే.
ఐతే సొసైటీలో పేరున్న వ్యక్తి, పైగా శిల్పా శెట్టి భర్త ఇలాంటి పనులు చేసి ఉంటాడా.. ఇవి తప్పుడు ఆరోపణలు అయ్యుంటాయేమో అని సందేహిస్తున్న వాళ్లూ లేకపోలేదు. కానీ రాజ్ ఒక ప్రణాళిక ప్రకారమే పోర్నోగ్రఫీ రాకెట్ నడిపిస్తున్నాడని.. దీని వెనుక పెద్ద తతంగమే ఉందని ముంబయి పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కొన్ని సంచలన విషయాలను వారు వెల్లడించారు.
బ్రిటన్‌లోని తన సమీప బంధువు ప్రదీప్ బక్షితో కలిసి రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల దందాను నిర్వహిస్తున్నట్లు వాట్సప్ గ్రూప్ చాటింగ్, ఈ-మెయిళ్ల ద్వారా వెల్లడైనట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ప్రదీప్ బక్షికి బ్రిటన్‌లో కెన్రిన్ అనే నిర్మాణ సంస్థ ఉంది. దాని ఆధ్వర్యంలో హాట్‌షాట్స్ అనే యాప్‌ను నిర్వహిస్తున్నారు.
కుంద్రా బాలీవుడ్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతులు, మోడళ్లను అశ్లీల చిత్రాల్లో నటించేలా ఒప్పించి.. పోర్న్ మూవీస్ తీస్తున్నారని.. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా కెన్రిన్ సంస్థ నిధులు సమకూర్చిందని.. చిత్రీకరణ తర్వాత కుంద్రా టీం వీడియోలను కెన్రిన్ సంస్థకు ఓ అప్లికేషన్ ద్వారా పంపిస్తోందని పోలీసులు వెల్లడించారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు ఆ వీడియోలను బ్రిటన్ నుంచి హాట్‌షాట్స్ యాప్‌తో పాటు మరికొన్ని యాప్‌లలోనూ అప్‌లోడ్ చేస్తున్నారట.
ఈ పోర్న్ కంటెంట్‌ను వీక్షించడానికి సబ్‌స్క్రైబర్ల నుంచి ఛార్జీలు వసూలు చేసేవారని.. దీని ద్వారా కుంద్రా కోట్ల రూపాయలు ఆర్జించాడని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.7.5 కోట్లను సీజ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కుంద్రాపై నేరం రుజువైతే 7 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందట. అతడికి జులై 23 వరకూ కోర్టు పోలీస్ కస్టడీ విధించింది.
This post was last modified on July 21, 2021 2:55 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…