Movie News

‘విరాటపర్వం’ విడుదలపై క్లారిటీ!

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో థియేటర్లు మూతపడడంతో చిన్న సినిమాలతో పాటు కాస్త పేరున్న సినిమాలు కూడా ఓటీటీలోకే వచ్చాయి. తాజాగా సురేష్ బాబు నిర్మించిన ‘నారప్ప’ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఆయన బ్యానర్ లో తెరకెక్కిన మరో సినిమా ‘విరాటపర్వం’ కూడా ఓటీటీలోకి వస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంలో రానా స్వయంగా ఇన్వాల్వ్ అయినట్లు టాక్ వచ్చింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో రానా డీల్ మాట్లాడుతున్నాడని.. దాదాపు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. దీంతో నెక్స్ట్ ఓటీటీలో రాబోయే పెద్ద సినిమా ‘విరాటపర్వం’ అంటూ కథనాలు ప్రచురించారు. కానీ ఇందులో నిజం లేదని తేల్చి చెబుతున్నారు చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల. గతంలో ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమా తెరకెక్కించిన వేణు రెండో సినిమా రానాతో చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.

అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు దర్శకుడు. సినిమాకి మంచి రేటు వచ్చిందని.. దీంతో ఓటీటీకి అమ్మేశారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకుల రద్దీని బట్టి త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పారు. సినిమాలో రానా, సాయి పల్లవిలకు సంబంధించిన సన్నివేశాలు మరో నాలుగు రోజుల చిత్రీకరణ చేయాల్సి ఉందని.. ప్రస్తుతం ఆ పనుల్లో ఉన్నట్లు చెప్పారు. 1990లలో మావోయిస్టు ఉద్యమం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

This post was last modified on July 21, 2021 10:45 am

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

8 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago