Movie News

పిక్ టాక్: చూపు తిప్పుకోవ‌డం క‌ష్ట‌మే


కొన్ని రోజులుగా అమ‌లా పాల్ పేరు మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల నోళ్ల‌లో నానుతోంది. చాన్నాళ్లుగా తెలుగు తెర‌పై క‌నిపించ‌ని ఆమె.. ఎట్ట‌కేల‌కు కుడి ఎడ‌మైతే అనే వెబ్ సిరీస్‌తో మ‌ళ్లీ మ‌న ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. అందులో అమ‌లా పాత్ర‌.. త‌న పెర్ఫామెన్స్ మ‌న జ‌నాల‌ను బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి. ఎప్పుడూ తెలుగులో గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్లే చేసిన అమ‌ల.. ఈ సిరీస్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ సీరియ‌స్, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఈ సిరీస్ ప్రమోష‌న్ల కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన అమ‌లా.. ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్‌గా క‌నిపిస్తూ కుర్రాళ్ల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. కుడి ఎడ‌మైతే వెబ్ సిరీస్‌లో ఎక్కువ‌గా ఖాకీ దుస్తుల్లో క‌నిపిస్తూ త‌న గ్లామ‌ర్ యాంగిల్‌ను దాచేసిన అమ‌ల‌.. ప్ర‌మోష‌న్ల‌లో మాత్రం అందాల విందు చేస్తోంది.

రాహుల్ విజ‌య్‌తో క‌లిసి చేసిన ఓ వీడియో ఇంట‌ర్వ్యూలో త‌న హాట్‌నెస్‌కు కుర్రాళ్లు షేకైపోతున్నారు. అలాగే ఇలాంటి హాట్ అవ‌తారంతోనే ఒక ఫొటో షూట్ చేసింది అమ‌ల‌. అందులో ఎంతో క్యూట్‌గా క‌నిపిస్తూనే.. చూపించాల్సిన అందాల‌న్నీ చూపిస్తూ ర‌సిక ప్రియుల హృద‌యాలు ప‌ట్టాలు త‌ప్పేలా చేస్తోంది. చూపు ప‌క్క‌కు తిప్పుకోలేని విధంగా ఉన్న ఈ ఫొటోలు అమ‌ల అభిమానుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ద‌ర్శ‌కుడు ఎ.ఎల్.విజ‌య్ నుంచి విడాకులు తీసుకున్నాక అమ‌ల‌.. సినిమాల్లో బోల్డ్ రోల్స్ చేస్తూ, చాలా గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తూ త‌న‌లోని కొత్త కోణాల‌ను చూపిస్తోంది. కొన్ని నెల‌ల కింద‌టే పిట్ట‌క‌థ‌లు సిరీస్‌లో చాలా హాట్‌గా క‌నిపించిన ఆమె.. ఇప్పుడు కుడి ఎడ‌మైతే సిరీస్‌తో త‌న న‌ట ప్ర‌తిభ‌ను చాటుకుంది. చూస్తుంటే మ‌ళ్లీ ఆమె తెలుగులో బిజీ అయిపోయేలా క‌నిపిస్తోంది.

This post was last modified on July 20, 2021 10:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!

ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…

1 hour ago

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

7 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

8 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

9 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

10 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

10 hours ago