రోజురోజుకి తన క్రేజ్ ను పెంచుకుంటూ సత్తా చాటుతున్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. ‘అసురన్’, ‘కర్ణన్’ లాంటి సినిమాలు అతడి స్థాయిని అమాంతం పెంచేశాయి. రీసెంట్ గా అతడు నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ హీరో రేంజ్ ఇంటెర్నేషనల్ లెవెల్ కి చేరింది. హాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ‘ది గ్రే మ్యాన్’ అనే సినిమాలో ధనుష్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
అలానే త్వరలోనే శేఖర్ కమ్ముల సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ధనుష్ మరో మైల్ స్టోన్ ను రీచ్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ కోలీవుడ్ స్టార్ యాక్టివ్ గానే ఉంటారు. ఇప్పుడు ఆయన ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. సౌత్ ఇండియాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నది ఒక్క మహేష్ బాబుకే. ట్విట్టర్ లో మహేష్ ని ఫాలో అయ్యేవారి సంఖ్య 11 మిలియన్లకు చేరుకుంది.
అంటే మహేష్ తరువాత స్థానంలో ధనుష్ నిలిచారు. ట్విట్టర్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న సౌత్ యాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారు. మరి ఫ్యూచర్ లో మహేష్ ని బీట్ చేసి ధనుష్ మొదటి స్థానానికి చేరుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ధనుష్ తమిళంలో కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది!
This post was last modified on July 19, 2021 1:26 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…
2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో..…
స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు ప్రాణం…